Begin typing your search above and press return to search.

బాబు స‌ర్కారుపై రోజా విసుర్లివే!

By:  Tupaki Desk   |   1 March 2017 8:13 AM GMT
బాబు స‌ర్కారుపై రోజా విసుర్లివే!
X
కృష్ణా జిల్లా నందిగామ వ‌ద్ద నిన్న తెల్ల‌వారుజామున జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 10 మంది చ‌నిపోగా, 30 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పియిన వారి కుటుంబాలకు భ‌రోసా క‌ల్పించ‌డం, క్ష‌త‌గాత్రుల‌కు ధైర్యం చెప్పాల్సిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం... ఆ గురుత‌ర బాధ్య‌త‌ను మ‌రిచి ప్రజ‌ల ప్రాణాల‌ను బ‌లిగొన్న ట్రావెల్స్ యాజ‌మాన్యాల‌ను కేసుల నుంచి ర‌క్షించేందుకే య‌త్నిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. నిన్న ప్ర‌మాద బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన సంద‌ర్భంగానే విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ అనుమానాల‌ను వ్య‌క్తం చేశారు. తాజాగా వైసీపీ కీల‌క నేత‌ - చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ను ప్ర‌స్తావించారు. కాసేప‌టి క్రితం తిరుప‌తిలో మీడియాతో మాట్లాడిన రోజా... బాబు స‌ర్కారు తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు చంద్ర‌బాబుకు స‌మ‌యం లేదా? అని రోజా ప్ర‌శ్నించారు. పరామ‌ర్శ‌కు స‌మ‌యం లేని చంద్ర‌బాబుకు... కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ బాబు.ఏ పై జ‌గ‌న్ దురుసుగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డానికి మాత్రం స‌మ‌య‌మెలా చిక్కింద‌ని ప్ర‌శ్నించారు. 10 మంది ప్రాణాల‌ను హ‌రించిన దివాక‌ర్ ట్రావెల్స్ యాజ‌మాన్యంపై ఇప్ప‌టిదాకా కేసు ఎందుకు పెట్ట‌లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఇదంతా చూస్తుంటే... దివాక‌ర్ ట్రావెల్స్ ను ఈ కేసు నుంచి త‌ప్పించేందుకే ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యం తీసుకుంద‌ని కూడా ఆమె ఆరోపించారు. త‌క్ష‌ణ‌మే దివాక‌ర్ ట్రావెల్స్ యాజ‌మాన్యంపై కేసులు న‌మోదు చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో న్యాయ పోరాటానికి దిగుతామ‌ని ఆమె హెచ్చ‌రించారు. అస‌లు ఈ కేసునే త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు య‌త్నిస్తున్నార‌ని ఆమె ధ్వ‌జ‌మెత్తారు. ట్రావెల్స్ య‌జ‌మాని అయిన టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డిని కాపాడేందుకు ప్ర‌భుత్వం య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు.

విందులు, వినోదాల కోసం చంద్ర‌బాబుకు స‌మ‌యం ఉంటుంది గానీ... ప్ర‌మాద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు మాత్రం ఆయ‌న‌కు స‌మ‌యం ఉండ‌దా అని రోజా ప్ర‌శ్నించారు. ఈ కేసులో పోలీసులు. వైద్యులు, జిల్లా క‌లెక్ట‌ర్ తీరును ప్ర‌శ్నించిన త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై కేసు న‌మోదు చేయ‌డం చంద్ర‌బాబు ప్ర‌భుత్వ దిగ‌జారుడుత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బాధితుల ప‌క్షాన నిల‌బ‌డితేనే కేసులు పెడ‌తారా? అని ఆమె ప్ర‌శ్నించారు. వ‌న‌జాక్షిని టీడీపీ ఎమ్మెల్యే ఈడ్చికొట్టిన రోజు జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఉన్న బాబు.ఏ ఏం చేశార‌ని ఆమె ప్ర‌శ్నించారు. టీడీపీ ఎంపీల‌కు చెందిన కేశినేని, దివాక‌ర్ ట్రావెల్స్ ప్ర‌జల ప్రాణాల‌ను హ‌రిస్తున్నాయ‌ని ఆమె ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/