Begin typing your search above and press return to search.

రోజా సెటైర్ల వర్షం...అచ్చెన్న గల్లీ లీడరేనంట!

By:  Tupaki Desk   |   15 March 2020 10:21 PM IST
రోజా సెటైర్ల వర్షం...అచ్చెన్న గల్లీ లీడరేనంట!
X
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని అధికార వైసీపీ నేతలు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. నిండు అసెంబ్లీలో అచ్చెన్నపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దాడి ఓ రేంజిలో ఉందనే చెప్పాలి. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా... అచ్చెన్నపై విరుచుకుపడ్డారు. అచ్చెన్నపై రోజా విరుచుకుపడిన వైనం... అసెంబ్లీలో జగన్ చేసిన సెటైర్ల దాడిని మించిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అచ్చెన్న ఓ గల్లీ లీడర్ అంటూ రోజా చేసిన హాట్ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.

అయినా అచ్చెన్నపై ఇప్పుడు రోజా అంతగా ఫైర్ కావడానికి కారణాలేమిటన్న విషయానికి వస్తే... ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆరు వారాల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలోనే ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విస్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల వాయిదాను వైసీపీ ఎత్తుగడగానే వాదిస్తూ అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు భయపడే వైసీపీ సర్కారు... వాయిదా మంత్రాన్ని అనుసరించిందని అచ్చెన్న వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు విన్నంతనే రోజాకు నిజంగానే కోపం నశాళానికి అంటినట్టుంది. అసలు విషయమేమిటో తెలియకుండా... నోటికి ఎది వస్తే దానినే మాట్లాడతారా? అంటూ అచ్చెన్నపై రోజా ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. అచ్చెన్నకు ఒళ్లు పెరిగిందే గానీ బుద్ధి మాత్రం పెరగలేదని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న అచ్చెన్న అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తనను తాను గల్లీ లీడర్ ను అని నిరూపించుకున్నారని కూడా రోజా మరింత సంచలన వ్యాఖ్య చేశారు. అచ్చెన్నకు బుద్ధి పెరగలేదని గతంలో జగన్ అసెంబ్లీ వేదికగానే సంచలన వ్యాఖ్య చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను మించి అచ్చెన్నను గల్లీ లీడర్ గా అబివర్ణిస్తూ రోజా చేసిన వ్యాఖ్య నిజంగానే వైరల్ గా మారిపోయింది.