Begin typing your search above and press return to search.

పోస్ట్ డేటెడ్ చెక్కుల‌తో ఔట్ డేటెడ్ సీఎం లీలలు!

By:  Tupaki Desk   |   4 Feb 2019 6:45 AM GMT
పోస్ట్ డేటెడ్ చెక్కుల‌తో ఔట్ డేటెడ్ సీఎం లీలలు!
X
ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌హిళా ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు. రుణ‌మాఫీ పేరుతో మ‌హిళ‌ల్ని బాబు మోసం చేస్తున్న‌ట్లు ఆమె ఆరోపిస్తున్నారు. ఎన్నిక‌లుద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో ప‌సుపు.. కుంక‌మ పేరుతో మ‌హిళ‌ల్ని మోసం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆరోపించిన రోజా.. మ‌హిళ‌ల తాళిబొట్టులు తెంపేలా బాబు పాల‌న ఉంద‌న్నారు.

చంద్ర‌బాబు మ‌హిళా ద్రోహి అన్న ఆమె.. డ్వాక్రా మ‌హిళ‌లు తీసుకున్న రుణాల్ని మ‌ఫీ చేసి ఉంటే.. రాష్ట్రంలో అక్కా చెల్లెళ్ల ఆత్మ‌హ‌త్య‌లు ఉండేవి కావ‌న్నారు. పోస్ట డేటెడ్ చెక్కులతో చంద్ర‌బాబు కొత్త నాట‌కాల‌కు తెర తీస్తున్న‌ట్లుగా చెప్పారు.

బాబు ఆరాచ‌కాల్ని త‌ట్టుకోలేని మ‌హిళ‌లు మహిళా మంత్రి ప‌రిటాల సునీత‌పై చెప్పులు.. చీపుర్ల‌తో తిరుగుబాటు చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు.ఏపీలోని మ‌హిళ‌ల‌కు న్యాయం చేయ‌లేని సునీత జ‌గ‌న్ ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేయ‌టం స‌రికాద‌న్నారు.

డ్వాక్రా రుణాల్ని మాఫీ చేస్తామ‌ని చెబుతున్న చంద్ర‌బాబుకు నిజంగానే ఆ ప‌ని చేసే ద‌మ్ము ఉందా? అని ప్ర‌శ్నించిన ఆమె.. మ‌రోసారి ఓటు వేయాల‌ని బాబు కోరుతున్నార‌ని.. ఏం చేశార‌ని ఆయ‌న‌కు ఓటు వేయాలో చెప్పాల‌న్నారు. బాబు పాల‌న‌కు గుడ్ బై చెప్పేలా రాష్ట్ర ప్ర‌జ‌లు నిర్ణ‌యం తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. జ‌గ‌న్ గెలిచిన వెంట‌నే న‌వ‌ర‌త్నాల్ని అమ‌లు చేస్తామ‌న్న హామీ ఇచ్చారు.