Begin typing your search above and press return to search.
పవన్ ఓ రబ్బర్ సింగ్
By: Tupaki Desk | 21 Aug 2016 12:05 PM ISTఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విమర్శల్లోకి జనసేన అధినే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం వచ్చి చేరారు. తాజాగా మీడియాతో మాట్లాడిన పవన్ ప్రత్యేక హోదాపై స్పందించిన సంగతి తెలిసిందే. అయితే జనసేన అధినేతపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పవన్ సినిమాల్లో గబ్బర్ సింగే కానీ, రాజకీయాల్లో మాత్రం రబ్బర్ సింగ్ అంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై పవన్ చేతులెత్తేశారని ఆమె విమర్శించారు. హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పవన్ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేతులు ఎత్తేస్తే తాను ముందుకు వస్తానని చెప్పిన పవన్ ఇపుడు ఎందుకు స్పందించడం లేదని రోజా నిలదీశారు. పైగా సమయం తీసుకుంటానని, కార్యాచరణ సిద్ధం చేసుకోలేదని చెప్పడం ఏంటని రోజా వ్యాఖ్యానించారు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రమే గబ్బర్ సింగ్ తప్ప నిజానికి అయన రబ్బర్ సింగ్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుది ద్వంద్వ వైఖరని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి చేయడం కాకుండా రోజుకో మాట చెప్తున్న చంద్రబాబు ప్రత్యేక హోదా ఎలా సాధిస్తారని రోజా ప్రశ్నించారు.
ఒకసారి ప్రత్యేక హోదా, మరోమారు ప్రత్యేక ప్యాకేజీ ఇంకోమారు కేంద్రానికి మద్దతివ్వడం వంటి విభిన్నమైన ప్రకటనలు చేయడం చంద్రబాబుకే చెల్లిందని రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబు గోరంత చేస్తే కొండంత ప్రచారం చేసుకోవడం తప్పించి పోరాటం చేసే లక్షణాలు లేనేలేవని ఆమె వ్యాఖ్యానించారు.