Begin typing your search above and press return to search.
బాబు ప్యూచర్ పై రోజా తాజా జోస్యం విన్నారా?
By: Tupaki Desk | 15 Aug 2016 11:19 AM ISTజగన్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా మాటలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఆమె నోరు కానీ విప్పారంటే.. వైరి పక్షం మీద మాటల బానాల్ని వందల కొద్దీ విసురుతుంటారు.ఫ్లో విషయంలో ఎలాంటి ఇబ్బంది లేని ఆమె మాటలు కాస్తంత కరకుగా.. కఠినంగా ఉంటాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే చాలు శివాలెత్తే ఆమె తాజాగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒక సమయంలో ఆమె చంద్రబాబు ఫ్యూచర్ ఎలా ఉంటుందన్న విషయాన్ని ఊహించి చెప్పుకొచ్చారు.
తాను తెలుగుదేశం పార్టీలో చేరతానంటూ చేస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేసిన ఆమె.. బాబు అనుకూల మీడియాలో ఇలాంటి వార్తలు వేసి.. దుష్ర్పచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాను టీడీపీలో చేరటాన్ని ఫన్నీ థింగ్ గా కొట్టి పారేసిన రోజా.. మైండ్ గేమ్ ఆడుతోందని విరుచుకుపడ్డారు. తిరుమల వెంకన్న సాక్షిగా వేయి కాళ్ల మండపాన్ని కూల్చేసిన చంద్రబాబు అప్పట్లో తగిన శాస్తి జరిగిందని.. అయినప్పటికీ విజయవాడలో 30 గుళ్లను కూల్చేసిన ఆ విగ్రహాల ముక్కల్ని లారీల్లో తరలించటం అపచారమంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేత రోజా వ్యాఖ్యానించారు.
దేవుడి విగ్రహాలను ముక్కలు చేసిన చంద్రబాబు సర్కారును ఆ దేవుడు సైతం తెలుగుదేశంపార్టీని ముక్కలు చేయటం ఖాయమంటూ జోస్యం చెప్పారు. రోజా జోస్యం ఎంత మేరకు నిజమవుతుందన్న విషయం ఇప్పట్లో తేలకున్నా.. ఆమె మాటల్లో తప్పు వెతికటం.. అలా తప్పులు ఎత్తి చూపే అవకాశం ఏపీ ముఖ్యమంత్రి ఇవ్వటం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల సెంటిమెంట్లను దెబ్బ తీసేలా నిర్ణయాలు కొన్ని ప్రత్యేక సందర్భంలో తీసుకున్నా.. వాటి విషయంలో కలిగే ప్రయోజనాల గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. అలాంటిదేమీ లేకుండా వెనుకా ముందు చూసుకోకుండా గుళ్లు లాంటి కట్టడాల్ని కట్టే విషయంలో మరింత జాగ్రత్త అవసరం. లేకుంటే.. రోజా లాంటి వారు ప్రభుత్వ వైఖరిని కడిగేయటం ఖాయం.