Begin typing your search above and press return to search.
రోజా మాటల్లో బాబు క్యారెక్టర్ ఏమంటే..?
By: Tupaki Desk | 27 Feb 2016 10:31 AM ISTఅసలే ఫైర్ బ్రాండ్. ఆ పైన ఎదురుదెబ్బలు. కళ్ల ముందే నిన్నటి వరకూ తామంతా ఒక జట్టుగా ఉన్నోళ్లంతా కనీసం టాటా.. బై బై కూడా చెప్పకుండా వెళ్లిపోవటం లాంటివి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేతలకు బాధ కలగొచ్చు. దీనికి తోడు.. జంపింగ్స్ పుణ్యమా అని తీవ్ర డిప్రెషన్ లో ఉన్న అధినేతకు అండగా ఉన్నట్లుగా అనిపించే అద్భుతమైన చాన్స్ వచ్చినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా లాంటి వారు ఊరుకుంటారా? మామూలు రోజుల్లోనే తమ రాజకీయ ప్రత్యర్థుల్ని ఉతికి ఆరేసే రోజా.. తాజా పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఓ రేంజ్ లో తిట్ల దండకం అందుకున్నారు.
బాబుపై ఫైర్ అయిన ఆమె.. ఏ చిన్న విషయాన్ని వదలకుండా బాబుపై దునుమాడారు. బాబు మీద ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఎలాంటి వ్యాఖ్యానం లేకుండా ఆమె అన్నది అన్నట్లుగా చెప్పేస్తే..
= ఆయన రాజకీయ జీవితమే తప్పుడు మార్గంలో మొదలైందని అందరికి తెలుసు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి మొదలు పెట్టిన రాజకీయం.. ఈ రోజు ఆయన.. ఆయన కుమారుడు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ప్రజలందరికి తెలుసు.
= క్యారెక్టర్ అంటాడు.. రాజకీయాల్ని వ్యాపారంగా మార్చేసి.. అప్పుడు ఎన్టీఆర్ దగ్గరున్న ఎమ్మెల్యేల్ని.. ఈ రోజు జగన్ వద్దనున్న ఎమ్మెల్యేల్ని కొన్న నీతిమాలిన క్యారెక్టర్ ఆయనది.
= రాజకీయాల్లో విలువల కోసం పాటుపడుతున్నానంటారు.. పక్కపార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలపై కేసులు పెట్టి.. సూట్ కేస్ లిచ్చి పార్టీలోకి చేర్చుకోవటమేనా విలువలు కాపాడటమంటే..?
= నాకుండేదే క్యారెక్టర్ అన్న సీఎం చంద్రబాబు మాటలు విన్న ఎవరికైనా నవ్వు తెప్పిస్తాయి.
= చంద్రబాబు మాదిరి జగన్ మోహన్ రెడ్డి వైశ్రాయి తరహాలో రాజకీయాలు చేసి ఎమ్మెల్యేలకు సూట్ కేసులు ఇచ్చి ఉంటే తన తండ్రి చనిపోయినప్పటి నుంచి ఇప్పటికే ఎన్నోసార్లు సీఎం అయి ఉండేవారు.
= చంద్రబాబు తన మంత్రులకు.. నేతలకు చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది నీతిమాలిన రాజకీయాలు.
=ప్రత్యేక హోదా కానీ.. రైల్వే జోన్ కానీ సాధించలేని అసమర్థ క్యారెక్టర్.
= మాపీ పేరుతో రైతులు.. డ్వాక్రా మహిళల్ని మోసగించిన మోసకారి.. దగాకోరుక్యారెక్టర్ ఆయనది.
= మా వాళ్లు బ్రీప్ డ్ మీ అంటూ ప్రపంచంలో తెలుగువారందరి పరువును తీసిన క్యారెక్టర్.
= ఇసుక మాఫియా నుంచి కల్తీ మద్యం మాఫియా దాకా.. సీఎస్ లు సంతకం పెట్టకున్నా ప్రాజెక్టు పనుల్లో వేల కోట్లు దోచుకున్న విషయం ఎవరికి తెలీదు?
= బాబు అనుచరులే కాల్ మనీ సెక్స్ రాకెట్ లో మహిళల్ని వ్యభిచారంలోకి దించుతున్న విషయం ప్రజలందరికి తెలుసు.
= లోకేశ్ తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంటున్నారు. ఇంత చిన్న వయసులోనే చేసిన తప్పులు దొరక్కుండా తప్పు చేయటం నేర్చుకున్నాడంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు లోకేశ్ వల్ల పెనుముప్పు పొంచి ఉంది. అందుకే.. తప్పుడు ఆలోచనల్ని తుంచి వేయాలని కోరుతున్నా.
= తండ్రిపై ఎస్సీ.. ఎస్టీ కేసు పెట్టి.. క్షణాల్లో జైల్లో పెట్టిన చంద్రబాబుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ నమస్కారం చేసిందంటే రాజకీయాల్లో ఏమి విలువలున్నట్లు?