Begin typing your search above and press return to search.
రాజధాని ప్లానుపై రోజారెడ్డి విసుర్లు
By: Tupaki Desk | 21 July 2015 2:39 PM IST ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రణాళికలు చేతికంది సీఎం చంద్రబాబు, టీడీపీ వర్గాలు పుల్ ఖుషీగా ఉన్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే రోజారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. సింగపూర్ ప్రభుత్వం రాజధాని కోసం ప్రణాళికలు ఉచితంగా ఇచ్చారనడం బూటకమని ఆరోపించారు. సింగపూర్ ప్రభుత్వవర్గం ఏమైనా చంద్రబాబుకు మేనమామలా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్లాన్ తయారీ కోసం లక్ష కోట్ల నజరానా వారికి ఇచ్చారని ఆరోపించారు.
పుష్కరాల్లో తొక్కిసలాటకు చంద్రబాబే కారణమని... ఎంతో నిజాయతీ గల తూర్పుగోదావరి కలెక్టర్ నివేదిక చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. ఓటుకు నోటు కేసు నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహించారని... అయితే పుష్కరాల్లో తొక్కిసలాట జరగడంతో దాన్నుంచి దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు హడావుడిగా ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ తీసుకు వచ్చారన్నారు.
సింగపూర్ బిజినెస్ చేసుకునే దేశమని, అది ఏ పనీ ఫ్రీగా చేయదని... అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కూడా ఫ్రీగా మాస్టర్ ప్లాను ఇవ్వదని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారతీయులు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, రాజధానిని సింగపూర్‌కు అప్పగించడం ద్వారా మనల్ని అవమానించారని విమర్శించారు. పుష్కరాల ప్రమాద ఘటన నుండి దృష్టి మరల్చేందుకే సింగపూర్ ప్రతినిధులతో చంద్రబాబు హడావుడి చేయించారన్నారు. రాజధాని ప్లానులో సామాన్యులకు, బడుగు బలహీనవర్గాలకు చోటివ్వలేదని ఆరోపించారు.