Begin typing your search above and press return to search.

పొత్తు కోస‌మే రాహుల్-బ్రాహ్మ‌ణి భేటీ అయ్యారు!

By:  Tupaki Desk   |   5 Nov 2018 11:00 PM IST
పొత్తు కోస‌మే రాహుల్-బ్రాహ్మ‌ణి భేటీ అయ్యారు!
X
కాంగ్రెస్ తో టీడీపీ జ‌త‌క‌ట్ట‌డం పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని నిల‌బెట్ట‌డం కోసం ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని....కాంగ్రెస్ కు చంద్ర‌బాబు తాక‌ట్టు పెట్టార‌ని విప‌క్షాల‌తోపాటు ప‌లువురు టీడీపీ నేత‌లు కూడా విమర్శ‌లు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా స్థాపించిన పార్టీ...అదే కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు తెల‌ప‌డంపై బాహాటంగా విమ‌ర్శ‌లు వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కాంగ్ర‌స్-టీడీపీ ల మైత్రి బంధంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిప‌డ్డారు. ఈ పొత్తు వెనుకు చంద్ర‌బాబు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి ఉన్నార‌ని - గ‌తంలో జ‌రిగిన ఎంట‌ర్ ప్రెన్యూర్స్ స‌మిట్ కు బ్రాహ్మ‌ణి హాజ‌ర‌యిన కార‌ణం కూడా ఇదేన‌ని రోజా ఆరోపించారు. రాహుల్ తో బ్రాహ్మ‌ణి భేటీ త‌ర్వాత‌....చంద్ర‌బాబు -రాహుల్ క‌లిసార‌ని అన్నారు.

వైఎస్ ఆర్ మ‌ర‌ణం త‌ర్వాత త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్ ను టీడీపీ - కాంగ్రెస్ లు టార్గెట్ చేశాయ‌ని రోజా అన్నారు. ఇపుడు టీడీపీ-కాంగ్రెస్ ల స్నేహ‌బంధాన్ని అంద‌రూ అస‌హ్యించుకుంటున్నార‌ని అన్నారు. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు గురించి చంద్ర‌బాబు చొక్కా ప‌ట్టుకొని టీడీపీ నేత‌లు అడ‌గాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు. కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా స్థాపించిన టీడీపీ ...కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ఎలా ఇస్తుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఏపీని అశాస్త్రీయ బద్ధంగా విభ‌జించిన కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు ఎలా పెట్టుకుంటుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. గ‌తంలో రాహుల్ పై చెప్పులు విస‌రాల‌న్ని టీడీపీ నేత‌లు....ఈ రోజు ఆయ‌న చెప్పులు మోసేందుక సిద్ధ‌మ‌య్యార‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తో టీడీపీ క‌లిస్తే స‌హించ‌బోమ‌ని...గ‌తంలో చెప్పిన టీడీపీ నాయ‌కులంతా ఇపుడు ఏం స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు.