Begin typing your search above and press return to search.
అట్లయితే.. సూపర్ హిట్టేనన్న మాట రోజమ్మ
By: Tupaki Desk | 21 July 2015 1:08 PM ISTఏ రంగానికి చెందిన వారు.. ఆ రంగానికి చెందిన ఉదాహరణలు తరచూ చెబుతుంటారు. అందుకు నేతలు మినహాయింపు కాదు. సుదీర్ఘకాలం సినిమాల్లో నటించి.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా టీవీ షోలలో.. సినిమాల్లో మెరిసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎంత మాటకారి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
మాటకారితనానికి దూకుడు జత చేరిస్తే రోజా అవుతుందని రాజకీయ ప్రత్యర్థులు ఆమెను అభివర్ణిస్తుంటారు. అలాంటి రోజమ్మ తాజాగా.. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన తాజా వీడియో మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మాస్టర్ ప్లాన్ కు సంబంధించి తాజా వీడియోను మగధీర.. బాహుబలి సినిమాలతో పోల్చారు. ఈ రెండు సినిమాల మాదిరి చంద్రబాబు రాజధాని సినిమా చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. పుష్కరాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటను జనం మర్చిపోయేందుకు రాజధాని సినిమా చూపిస్తున్నారంటూ ఆరోపించిన రోజమ్మ.. రాజధాని సినిమాను పచ్చి మోసంగా అభివర్ణించారు.
చంద్రబాబును తిట్టే ప్రయత్నంలో రోజమ్మ మగధీర.. బాహుబలి సినిమాలతో పోలిస్తే..దానికి తెలుగు తమ్ముళ్లు మరోలా చెబుతున్నారు. మగధీర.. బాహుబలి సినిమా మాదిరి తమ రాజధాని నిర్మాణ ప్రయత్నం కూడా బంపర్ హిట్ అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యర్థుల్ని ఘాటుగా తిట్టాలన్న ప్రయత్నంలో అనవసరమైన ఉదాహరణలు చెప్పి.. రోజమ్మ సెల్ఫ్ గోల్ కొట్టుకునేలా వ్యాఖ్యలు చేశారన్న మాట వినిపిస్తోంది.