Begin typing your search above and press return to search.
బాబును నమ్మేదెలా అంటున్న రోజా!
By: Tupaki Desk | 4 Jan 2017 4:31 PM ISTవైసీపీ ఫైర్ బ్రాండ్ - చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోమారు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఏపీ సర్కారు తీసుకుంటున్న ప్రతి అంశాన్ని - ప్రతి ప్రకటన - చంద్రబాబు నోట వస్తున్న అన్ని కామెంట్లపై తనదైన శైలిలో విమర్శలు సంధిస్తున్న రోజా... తాజాగా కొద్దిసేపటి క్రితం తిరుపతి వేదికగా చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా చంద్రబాబు చేసిన కామెంట్స్‌నే ఆధారం చేసుకుని... సరిగ్గా చంద్రబాబు తిరుపతి పర్యటనకు వచ్చిన సమయంలోనే రోజా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అయినా రోజా చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే... చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీలో మరో వెన్నుపోటుకు ఆస్కారముందట. టీడీపీ వ్యవస్థాపకుడు - దివంగత నేత ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు... ఈ దఫా తనకే వెన్నుపోటు ముప్పున్న విషయాన్ని ముందే పసిగట్టారట. ఇక ఈ వెన్నుపోటు ఎవరి నుంచి ఎదురవుతుందన్న విషయాన్ని కూడా రోజా చెప్పేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేశ్ తన తండ్రికే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన చంద్రబాబు తన కొడుకును మంత్రి మండలిలోకి చేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదట. ఆ తర్వాత చంద్రబాబు మైండ్ సెట్ పై విరుచుకుపడ్డ రోజా... కేలండర్లు మారుతున్నా కూడా చంద్రబాబు వైఖరి మాత్రం మారడం లేదని ఆమె ఆరోపించారు. చంద్రబాబు పాలన మూడు మోసాలు - ఆరు అబద్ధాలుగా సాగుతోందని తీవ్రంగా విమర్శించారు. ఇందుకు ఆమె... కర్నూలులో చంద్రబాబు చేసిన కామెంట్లనే ఉదాహరణగా పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంకు నీళ్లు లేవని చెబుతున్న చంద్రబాబు... వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు నీరిస్తామని చెబుతున్నారని, ఈ మాటలను ఎలా నమ్మేదంటూ రోజా వ్యాఖ్యానించారు. అసలు చంద్రబాబు చేస్తున్న ఈ వ్యాఖ్యలను జనం నమ్ముతారా? అని కూడా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. రాయలసీమకు నిధులెఉ ఇవ్వకుండా, ప్రాజెక్టులు పూర్తి చేయకుండా చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/