Begin typing your search above and press return to search.

పాల ప్యాకెట్లు అమ్మి క్రికెట్ కిట్ కొన్న రోహిత్ శర్మ

By:  Tupaki Desk   |   29 March 2023 5:00 AM GMT
పాల ప్యాకెట్లు అమ్మి క్రికెట్ కిట్ కొన్న రోహిత్ శర్మ
X
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు దేశాన్ని నడిపిస్తున్నా కెరీర్ ఆరంభంలో ప్రతి ఒక్కరూ శ్రమించినవారే. ఆర్థికంగా ఇబ్బంది పడ్డవారే. ఇబ్బంది పడినప్పుడు ఇంకాస్త కష్టపడాల్సి ఉంటుంది. దానికి చక్కటి ఉదాహరణ టీమిండియా సారథి రోహిత్ శర్మ గత అనుభవాలను భారత మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

ఐపీఎల్ పాలక మండలి సభ్యుడు, భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా తాజాగా రోహిత్ శర్మతో నిర్వహించిన చిట్ చాట్ లో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. భారత కెప్టెన్ మిడిల్ క్లాస్  నేపథ్యం నుంచి వచ్చేవాడని తెలిసింది. అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా ఎదగడంలో రోహిత్ ఎన్నో కష్టాలు పడ్డాడన్న సంగతి తెలిసింది. ఓజా - రోహిత్  పాతసంగతులు గుర్తు చేసుకున్నారు.

అండర్ 15 క్రికెట్ స్థాయి రోహిత్, ఓజా కలిసి ఆడారు. ఐపీఎల్ లో డెక్కన్ ఛార్జర్స్ తరుఫున కొన్ని మ్యాచ్ లు ఆడారు. క్రికెట్ ఆడే తొలి రోజుల్లో తాము ఎదుర్కొ్న కష్టాలను గుర్తు చేసుకున్నాడు. కొత్త కిట్ ను కొనుగోలు చేసుకునేందుకు రోహిత్ శర్మ పాల ప్యాకెట్లను కూడా డెలివరీ చేసినట్లు చెప్పాడు.

అండర్ 15 జాతీయక్యాంప్ లో రోహిత్ ను కలిశానని.. ఆటలో దూకుడుగా ఉండే రోహిత్ పెద్దగా మాట్లాడేవాడు కాదని.. నాతో ఆడేటప్పుడు మాత్రం చాలా దూకుడుగా ఉండేవాడని.. ఎందుకు అలా ఉన్నాడో కూడా తెలియదు. కొన్నాళ్లకు మా మధ్య స్నేహం పెరిగింది. రోహిత్ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు.  ఒకసారి క్రికెట్ కిట్ బడ్జెట్ గురించి చర్చ జరుగుతుండగా రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు.  దాని కోసం అతడు పాల ప్యాకెట్ల డెలివరీ కూడా చేశాడు.  ఇదంతా జరిగి చాలా కాలమైంది. మా క్రికెట్ ప్రయాణం ఎలా ప్రారంభమైంది. ఇప్పుడు రోహిత్ ఎదిగిన తీరును చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’ అని ఓజా తెలిపారు.  

ఓజా మరియు రోహిత్ కలిసి 2 టెస్టులు సహా భారతదేశం కోసం 24 మ్యాచ్‌లు ఆడారు. అప్పటి నుండి మైదానం వెలుపల మంచి స్నేహితులు.
 
రోహిత్ శర్మ 2007లో  వైట్-బాల్ క్రికెట్‌లో భారత అరంగేట్రం చేశాడు. ప్రారంభ టీ20 ప్రపంచ కప్‌లో ముంబై బ్యాటర్ మెరిసిపోవడంతో రోహిత్  అంతర్జాతీయ క్రికెట్‌కు చేరుకున్నాడు, ఇది అతని మొదటి ప్రధాన టోర్నమెంట్ అత్యున్నత స్థాయిలో గుర్తింపు దక్కింది.. ఎంఎస్ ధోని విజేత జట్టులో కీలకమైన 50తో సహా 4 మ్యాచ్‌ల్లో రోహిత్ 88 పరుగులు చేశాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.