Begin typing your search above and press return to search.

ఫొటో పోస్ట్​ చేసిన రోహిత్​ శర్మ... ట్రోల్​ చేస్తున్న భార్య రితిక..!

By:  Tupaki Desk   |   1 March 2021 5:00 PM IST
ఫొటో పోస్ట్​ చేసిన రోహిత్​ శర్మ... ట్రోల్​ చేస్తున్న భార్య రితిక..!
X
ఇటీవల రోహిత్​ శర్మ చేసిన ఓ పోస్టు సోషల్​మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. ఓ ఫొటోను రోహిత్​ పోస్ట్​ చేయగా.. ఇతరులు ఎవరూ ట్రోల్స్ చేయకపోయినా ఆయన సతీమణి రితిక ట్రోల్ చేశారు. ఇంతకీ ఆ ఫొటో ఎప్పుడు షేర్​ అందులో అంత ఏం విశేషం ఉందంటారా..!టీమిండియా జట్టు అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్ పై మూడవ టెస్ట్ ఆడి విజయం సాధించింది. ప్రస్తుతం నాలుగో టెస్ట్ కోసం అక్కడే టీం ఇండియా ప్రాక్టీస్​ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే మూడో టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడంపై మాజీ ఆటగాళ్ల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం నాలుగో టెస్ట్ కోసం టీం ఇండియా నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది.

ఈ సందర్భంగా రోహిత్ మైదానంలో ఉన్న పచ్చిక మీద పడుకొని ఉన్న ఓ ఫోటోను పోస్ట్​ చేశారు. ‘పిచ్​ ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నా’ అంటూ ఓ క్యాప్షన్​ కూడా పెట్టాడు.

ఇదిలా ఉంటే ఆయన భార్య రితికా ఈ పోస్ట్​పై స్పందించారు.

ఈ ఫొటోను ఆమె ఆమె ట్రోల్ చేసింది. ఆ ఫొటోకు రిప్లై ఇస్తూ.. ‘మళ్లీ నేను బద్దకంగా ఉంటే ఎగతాళి చేస్తావ్’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. రోహిత్​ శర్మ.. రితికా నిత్యం సోషల్​మీడియాలో అలర్ట్​గా ఉంటారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్​ నాలుగో టెస్ట్​ కోసం సన్నద్ధం అవుతున్నాడు. రోహిత్​ శర్మ ఈ సీరిస్​లో 150 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్​ మళ్లీ గాడిలోకి వచ్చాడని అతడి ఫ్యాన్స్​ ఖుషీ అవుతున్నారు.