Begin typing your search above and press return to search.

సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్

By:  Tupaki Desk   |   13 Feb 2021 12:30 PM GMT
సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్
X
ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ శర్మ ఆదుకున్నాడు. 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కెప్టెన్ కోహ్లీ సున్నాకు, ఓపెనర్ గిల్ సైతం సున్నా పరుగులకే ఔట్ అయిన వేళ సెంచరీతో కదంతొక్కి భారత్ కు గౌరవప్రదమైన స్కోరును సాధించిపెట్టాడు. 231 బంతుల్లో 161 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అతడికి రహానే 67 పరుగులతో సహకరించాడు.

టీమిండియాను నిలబెట్టిన రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు నమోదు చేశాడు. 123 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును సాధించాడు.వెస్టిండీస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ లపై అన్ని ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా రోహిత్ ఘనత సాధించాడు.

అలాగే 2021లో టీమిండియా తరుఫున సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. భారత్ లో జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో 200 సిక్సర్లు కొట్టిన మొదటి ఆటగాడు రోహిత్ కావడం విశేషం.ఇక ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో కడపటి వార్తలు అందేసరికి భారత్ 284 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి పోరాడుతోంది. రిషబ్ పంత్ 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు.