Begin typing your search above and press return to search.

గులాబీ దళాన్ని కలవరపెడుతున్న పంచాయితీ

By:  Tupaki Desk   |   17 Dec 2019 3:30 PM GMT
గులాబీ దళాన్ని కలవరపెడుతున్న పంచాయితీ
X
ఇప్పుడు తెలంగాణలో అంతా టీఆర్ఎస్సే..89మంది గులాబీ పార్టీ నుంచి గెలిచారు. కాంగ్రెస్ నుంచి దాదాపు నలుగురు ఐదుగురు తప్పా అందరూ కారెక్కారు. ఇక బీజేపీ - కాంగ్రెస్ చోటామోటా నేతలంతా కారులో కలిశారు. ఇప్పుడు కారు ఫుల్ టైట్ తో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో నెలలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు టీఆర్ఎస్ పార్టీలో పెద్ద పంచాయితీకి దారి తీస్తోంది.

స్వతహాగా టీఆర్ ఎస్ లో ఉన్న వాళ్లు టికెట్ మాకేనంటున్నారు. ఇక వేరే పార్టీలో ఉండి టీఆర్ ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల అనుచరులు టికెట్ మాకే కావాలంటున్నారు. ఇలా టీజీ బ్యాచ్ - బీటీ బ్యాచ్ మధ్యన పంచాయతీతో టికెట్ల కేటాయింపు పంచాయితీ తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ వద్దకు వచ్చిందట..

ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్హాపూర్ లో ఓడిపోయిన మాజీ మంత్రి - టీఆర్ ఎస్ నేత జూపల్లి వర్సెస్ హర్షవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ సెగలు కక్కుతోంది. జూపల్లిపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరి ఇప్పుడు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. జూపల్లిని టీఆర్ ఎస్ లో డమ్మీని చేయడంతో ఆయనను నమ్ముకున్న వాల్లు ఇప్పుడు టికెట్లు తమకు దక్కుతాయో లేదనని మథపడుతున్నారు.

ఇక కోదాడలోనూ కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన ఎండీ జానీ తానే మున్సిపల్ చైర్మన్ అని ప్రకటించడం టీఆర్ ఎస్ ను నమ్ముకొని ఉన్న నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

తాండూర్ లో మహేందర్ రెడ్డి వర్సెస్ రోహిత్ రెడ్డి ఎపిసోడ్ లో ఇదే పంచాయితీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్ రెడ్డి వర్గం - మహేందర్ రెడ్డి వర్గం సీట్ల కోసం కొట్టుకుంటున్న పరిస్థితి.

ఇలా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముందే బీటీ బ్యాచ్ - టీజీ బ్యాచ్ మధ్య సీట్ల కోసం పంచాయితీ మొదలైంది. దీనిపై కేసీఆర్ ఇప్పటికే మంత్రులను ఈ పంచాయితీకి తెరదించాలని ఆదేశించారట.. మరి ఈ పంచాయితీ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ దళాన్ని ఎంత డ్యామేజ్ చేస్తుందో వేచిచూడాలి.