Begin typing your search above and press return to search.

రోహిత్​ ఫిట్​గానే ఉన్నాడు కానీ.. బీసీసీఐ

By:  Tupaki Desk   |   12 Dec 2020 2:32 PM GMT
రోహిత్​ ఫిట్​గానే  ఉన్నాడు కానీ.. బీసీసీఐ
X
రోహిత్​ ఎప్పుడెప్పుడు ఆస్ట్రేలియా వెళ్లి మ్యాచ్​ ఆడతాడా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా టూర్​లో వన్డే, టీ 20 సిరీస్​లో రోహిత్​ లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీంతో ఫ్యాన్స్​ అంతా రోహిత్​ రాకకోసం ఎదురుచూస్తున్నారు. రోహిత్​ ఫిట్​గానే ఉన్నాడని ఇంతకాలం చెప్పిన బీసీసీఐ తాజాగా మళ్లీ మెలిక పెట్టింది. అతడు ప్రస్తుతం ఫిట్​గానే ఉన్నప్పటికీ.. 15రోజులు క్వారంటైన్​లో ఉండాలని.. ఆ సమయంలో ఆరోగ్యం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని రోహిత్​కు సూచించింది.

ఆస్ట్రేలియా టూర్​కు రోహిత్​ను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంగా స్వయంగా బీసీసీఐ చైర్మన్​ గంగూలీయే క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. చివరకు రోహిత్​ను ఆస్ట్రేలియా టెస్ట్​సీరిస్​కు ఎంపికచేశారు. అయితే శుక్రవారం రోహిత్​ ఫిట్‌నెస్ విషయమై బీసీసీఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

ఎన్‌సీఏలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో రోహిత్ పూర్తి ఫిట్‌‌గా ఉన్నాడని చెప్పింది. అతడు ఆస్ట్రేలియా టూర్​కు వెళ్తాడని కానీ అక్కడ 14 రోజులు క్వారంటైన్​లో ఉండి ఆ తర్వాతే జట్టు సభ్యులతో కలుస్తాడని చెప్పింది. డిసెంబర్ 17న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.