Begin typing your search above and press return to search.

కొత్త కోణం; ‘‘సానియా ఓ స్వీటీగర్ల్’’

By:  Tupaki Desk   |   15 Dec 2015 6:29 AM GMT
కొత్త కోణం; ‘‘సానియా ఓ స్వీటీగర్ల్’’
X
సానియా మీర్జాకు ఓ చక్కటి కాంప్లిమెంట్ దక్కింది. సానియా మీర్జాను ఇప్పటివరకూ ఎవరూ చేయని కోణంతో వ్యాఖ్యలు చేశారు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్. మరో 16 రోజుల్లో ముగియనున్న 2015 ఆమె తన జీవితంలో అస్సలు మర్చిపోలేని సంవత్సరంగా చెప్పాలి. మహిళా డబుల్స్ లో మార్టినా హింగిస్ తో జత కలిసి అద్భుతంగా రాణించి.. టైటిళ్ల మీద టైటిళ్లు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐపీటీఎల్ పోటీల్లో పాల్గొనేందుకు ఇండియా వచ్చిన ఫెదరర్.. సానియా మీర్జా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సానియా మీర్జా కారణంగా భారత్ లోని ఎంతోమందికి ఆమె ఒక స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసలు కురిపించిన ఫెదరర్.. ‘‘సానియా ఒక స్వీటీ గర్ల్’’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. 2014లో తాను సానియామీర్జాతో కలిసి మిక్సెడ్ డబుల్స్ ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఫెదరర్.. వింబుల్డన్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్ లో సానియా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిందని మెచ్చుకున్నారు. సానియామీర్జాను ప్రశంసలతో ముంచెత్తిన ఆయన.. తనకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అంటే ఇష్టమన్నారు. తాను వీడియో గేమ్ క్రికెట్ ఆడుతుంటే.. తన జట్టులో సచిన్ తప్పనిసరిగా ఉంటాడంటూ కొత్త విషయాన్ని చెప్పుకొచ్చాడు.