Begin typing your search above and press return to search.
స్పేస్ స్టేషన్ కక్ష్యలోకి దూసుకొచ్చిన రాకెట్ శకలం..తప్పిన ఘోర ప్రమాదం!
By: Tupaki Desk | 23 Sep 2020 5:30 PM GMTఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కొద్దిలో ఘోర పెను ప్రమాదం తప్పింది. స్పేస్ స్టేషన్ దిశగా అంతరిక్ష శకలం దూసుకొస్తున్న సమయంలో స్పేస్ స్టేషన్ లోని రష్యా, అమెరికా ఫ్లయిట్ కంట్రోలర్లు దాన్ని భూకక్ష్య నుంచి స్పల్పంగా దూరం జరిపారు. దీంతో, శకలం దానికి సుమారు 1.40 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోయింది.
2018లో జపాన్ ప్రయోగించిన రాకెట్ సుమారు 77 ముక్కలైంది. దానికి సంబంధించిన ఓ శకలం ఇప్పుడు స్పేస్ స్టేషన్ కక్ష్యలోకి వచ్చింది. దాని నుంచి తప్పించేందుకు వ్యోమగాములు ఈ విన్యాసాన్ని చేపట్టారు. అంతరిక్ష కేంద్రం గంటకు 17 వేల కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తుంటుంది. దానికి ఒక చిన్న వస్తువు తగిలినా పెను ప్రమాదం సంభవిస్తుంది. అయితే ఇలాంటివి సర్వసాధారణమని నాసా చీఫ్ తెలిపారు. 1999 నుంచి 2018 వరకు ఇలాంటి విన్యాసాలను 25 సార్లు నిర్వహించినట్టు వెల్లడించారు.