Begin typing your search above and press return to search.

అమెరికా ఎంబసీ పైకి దూసుకొచ్చిన రాకెట్లు

By:  Tupaki Desk   |   19 Dec 2021 9:54 AM GMT
అమెరికా ఎంబసీ పైకి దూసుకొచ్చిన రాకెట్లు
X
శత్రుదేశంలో అగ్రరాజ్యం అమెరికా ఎంబసీపై బాంబుల దాడి జరిగింది.. ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి ఆదివారం రెండు రాకెట్లు దూసుకొచ్చాయి. ఈ ప్రాంతంలోని అమెరికన్ ఎంబసీ లక్ష్యంగా వీటిని ప్రయోగించినట్లు భద్రతాధికారులు తెలిపారు.

ఇరాక్ భద్రతా దళాలు ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. బాగ్దాద్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి ఆదివారం రెండు రాకెట్లు దూసుకొచ్చాయి. గ్రీన్ జోన్ లో ఉన్న అమెరికన్ ఎంబసీ లక్ష్యంగా వీటిని ప్రయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఇవి కట్యూషా రాకెట్లుగా గుర్తించారు.

కాగా మొదటి రాకెట్ ను సీరామ్ డిఫెన్స్ బ్యాటరీలు ఆకాశంలో ఉండగానే కూల్చేశాయి. ఇది అమెరికన్ ఎంబసీకి సమీపంలో పడింది. రెండోది ఓ స్వ్కేర్ లో పడడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ రాకెట్లను ఎవరు ప్రయోగించారో తెలియదు. దీనికి తమదే బాధ్యత అని ఇప్పటివరకూ ఎవరూ ప్రకటించలేదు.

అమెరికన్ దళాలు, ఆస్తులపై రాకెట్, డ్రోన్ దాడులు ఇటీవల పెరుగుతున్నాయి. ఇరాన్ అనుకూల వర్గాలే ఈ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికన్ దళాలు ఇరాక్ నుంచి పూర్తిగా వదిలి వెళ్లిపోవాలని ఇరాన్ అనుకూల గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి.