Begin typing your search above and press return to search.
కోటి రూపాయల కంపెనీకి ర్యాగ్ పికర్ ఓనర్
By: Tupaki Desk | 21 Nov 2015 10:37 AM GMTవీధుల్లో చెత్త ఏరుకునే ఆమె ఇప్పుడు ఎన్నోసంస్థలను తళతళ మెరిసిపోయేలా మారుస్తోంది.క్లీనింగ్ సేవల సంస్థ స్థాపించి 45 ఆర్గనైజేషన్లకు స్వచ్ఛతా సహాయం చేస్తోంది. కష్టపడితే ఫలితందక్కక మానదు అనడానికి ఆమె నిలువెత్తునిదర్శనంగా నిలుస్తోంది. ఒకప్పుడు ఐదు రూపాయల సంపాదన కోసం అహ్మదాబాద్ వీధుల్లో చెత్తను ఏరుకున్న స్థాయి నుంచి ఏడాదికి కోటి రూపాయల టర్నోవర్ గల సంస్థను నడిపిస్తున్న స్థాయికి చేరడం వెనుక ఆమె కృషి తప్ప రెండో కారణమే లేదు. అహ్మదాబాద్ కు చెందిన అరవై ఏళ్ళ మంజులా వాఘేలా ప్రస్థానం చూస్తే ఎవరైనా లేచి నిల్చుని సెల్యూట్ కొట్టాల్సిందే.
ప్రస్తుతం కోటి రూపాయల టర్నోవర్ ఉన్నక్లీనర్స్ కో ఆపరేటివ్ సంస్థ కు మంజులా యజమాని. సౌందర్య సఫాయీ ఉత్కర్ష్ మహిళా సేవా సహకారి మండలి లిమిటెడ్ పేరున ప్రస్తుతం అహ్మదాబాద్ లోని 45 సంస్థలకు ఆమె పనివాళ్లను అందించడమే కాకుండా క్లీనింగ్ - హౌస్ కీపింగ్ సేవలు అందిస్తోంది.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ.. క్లీనర్స్ కో ఆపరేటివ్ సంస్థకు భారత దేశంలో మొట్ట మొదటి ఆథరైజ్డ్ కస్టమర్ ఆమె. వీధుల్లో చెత్త ఎత్తుకునే ఆమె క్లీనింగ్ సేవలను ప్రారంభించి అక్కడి నుంచి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇప్పుడు 45 సంస్థలకు నాలుగు వందల మంది సభ్యులతో తమ సేవలు అందిస్తూ కోటి రూపాయల టర్నోవర్ గల కంపెనీ ఓనరయ్యారు. వివిధ సంస్థల్లో రహదారులు ఊడవడం - వాక్యూమ్ క్లీనింగ్ - ఫ్లోర్ క్లీనింగ్ - కార్పెట్లను శుభ్రపరిచే మెషీన్లను నడపడం వంటి పనులను మంజుల సంస్థకు చెందిన సిబ్బందే చూసుకుంటున్నారు. ఏటేటా ఆమె కంపెనీకి ఆదరణపెరుగుతుండడం... మరిన్ని కొత్త సంస్థలు వీరిసేవలు కోరుకుంటుండడం విశేషం.