Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం..బైక్ ను ఢీ కొట్టిన కార్ - ఫ్లై ఓవర్ నుండి పడి యువకుడు మృతి!
By: Tupaki Desk | 18 Nov 2020 3:00 PM ISTహైదరాబాద్ లోని ఎల్బీ నగర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా , మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ప్రస్తుతం హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. స్పీడ్ గా వచ్చిన ఓ కారు ఫ్లై ఓవర్ పై వెళ్తున్న ఓ బైక్ ను ఢీ కొట్టింది. దీనితో ఒక్కసారిగా బైక్ డ్రైవ్ చేసే యువకుడు గాల్లోకి లేచి , ఫ్లై ఓవర్ నుండి కిందపడిపోయాడు. ఫ్లై ఓవర్ పై నుండి కిందపడిపోవడం తో తలకి తీవ్ర గాయమై , అక్కడికక్కడే మరణించాడు. అలాగే అదే బైక్ లో ఉన్న యువతి , మరో బైక్ లో ఉన్న ఇద్దరు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ...
ఫతేనగర్ కి చెందిన ఓ యువతికి మంగళవారం ఎల్బీనగర్ లో పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. దీనితో మేనత్త కుమారుడు ఉదయ్ రాజ్ ఆమెను తన బైక్ పై పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి, పరీక్ష అనంతరం ఇద్దరు కలిసి బైక్‌పై సంఘీ ఆలయానికి వెళ్తున్నారు . ఈ క్రమంలో ఎల్బీనగర్ వైపు నుంచి హయత్ నగర్ వైపు వెళ్తుండగా ఎల్బీనగర్ ఫ్లైఓవర్ పై ఓ కారు వీరి బైక్ ను ఢీకొట్టింది. స్పీడ్ గా వచ్చి కారు ఢీ కొట్టడంతో దీంతో ఉదయ్ రాజ్ అమాంతం గాల్లోకి ఎగిరి ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడిపోయాడు. దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందాడు అని వైద్యులు చెప్పారు.
ఈ ప్రమాదంలో ఆ యువతి తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదానికి కారణమైన కారు ఫ్లైఓవర్ పై మరో బైక్ ను కూడా ఢీకొట్టింది. దీంతో సాయిప్రియ,బానోత్ నగేష్ అనే మరో ఇద్దరు యువకులు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వీరు చికిత్స తీసుకుంటున్నారు. మాద సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు