Begin typing your search above and press return to search.

బాలయ్యను తిట్టాలంటే... రోజమ్మా ఇది సినిమా కాదమ్మా..?

By:  Tupaki Desk   |   18 Aug 2022 4:38 PM GMT
బాలయ్యను తిట్టాలంటే...  రోజమ్మా ఇది సినిమా కాదమ్మా..?
X
అదేంటో రాజకీయాలు సినిమాలు అన్నీ కలసిపోయాయి. ఒక విధంగా చెప్పాలీ అంటే కలగా పులగం అయిపోయాయి. వెండితెర వీరత్వాలు రాజకీయాల్లో సాగవు. ఇది రియల్ లైఫ్. ఆ విషయం పదే పదే రుజువు అవుతున్నా సినిమా గ్లామర్ ని ఇంకా వీడిపోని అట్టేపెట్టుకుని ఉండే మాజీ హీరో హీరోయిన్లకు మాత్రం విషయం ఇంకా అర్ధం కావడంలేదుట.

అందుకే వారు ఇంకా సినిమాటిక్ గా మాట్లాడుతూ అదే లోకం లో బతుకుతూ ఉంటారు. ఇక రోజా విషయానికి వస్తే ఆమె తొంబై దశకంలో హీరోయిన్. స్టార్ స్టాటస్ కూడా దక్కించుకున్నారు. ఆమె ఆనాటి అందరు టాప్ హీరోలతో కూడా నటించారు. ఇక బాలయ్యతో అయితే ఏకంగా ఏడు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. ఈ ఇద్దరికీ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. రోజాకు మంచి హిట్లు అలా వచ్చాయి.

అందుకే ఆమెకు బాలయ్య మీద ఒక అభిమానం ఉంది. సినిమా సీన్ కట్ చేస్తే రోజా 2000 నుంచే రాజకీయాల్లో ఉంటున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు గెలిచారు. ఇక బాలయ్య కూడా 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ వచ్చారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. హిందూపురంలో ఆయన హ్యాట్రిక్ విజయం కోసం ట్రై చేస్తున్నారు. అందుకే ఆయన వీలు దొరికినపుడల్లా పర్యటిస్తున్నారు.

ఇదిలా ఉండగా లేటెస్ట్ పర్యటనలో బాలయ్య వైసీపీ మీద హాట్ హాట్ కమెంట్స్ చేశారు. మంత్రులకు గడప గడప కార్యక్రమంలో జనాల నుంచి నిరసనలు వస్తున్నాయని దెప్పిపొడిచారు. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో మీద మాట్లాడుతూ ఆయన ఎలా స్వాతంత్ర దినోత్సవ వేళ జెండా ఎగరేస్తారు అని ప్రశ్నించారు. దానికి మంత్రి మాజీ హీరోయిన్ అయిన ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆమె బాలయ్య మీద కాస్తా సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లుగా మాట్లాడడమే ఇక్కడ చిత్రం

బాలయ్య మా హీరో. ఆయన్ని తిట్టాలీ అంటే మనసు రావడంలేదు అని ఆమె అనడమే విశేషం. అయితే ఇది సినిమా కాదు రోజమ్మా రాజకీయం అని తెలుసుకోవమ్మా అనే అంతా అంటున్నారు. అటు బాలయ్య అయినా ఇటు రోజా అయినా జనాల గురించే మాట్లాడాలి తప్ప ఒకరిని ఒకరు తిట్టుకోవడం కోసం కాదు కదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. బాలయ్య అన్న దానికి జవాబు చెప్పాలి అంతే తప్ప ఆయన్ని తిట్టమని ఎవరు అన్నారు రోజమ్మా అని కూడా కౌంటర్లు వేస్తున్నారు.

ఇక బాలయ్య అపుడెప్పుడో ఒక సినిమా ఫంక్షన్ లో ఏదో ఫ్లోలో అన్న ఒక్క మాటను పట్టుకుని ఆయన మీద యాక్షన్ టీడీపీ ఎందుకు తీసుకోలేదు, ఆయన మహిళలను కించపరచారు అని రోజా మాట్లాడుతున్నారు. కళ్ళ ముందు న్యూడ్ వీడియోతో దొరికిన వారి విషయం ఏంటి అని టీడీపీ అడుగుతూంటే ఈ జవాబులు ఏంటి అని కూడా మండిపడుతున్నారు. మొత్తానికి రోజా తాను ఇంకా హీరోయిన్ అనే భావిస్తున్నారులా ఉంది. అలాగే బాలయ్య హీరోగానే ఫీల్ అయితే మళ్ళీ సినిమాల్లో వేస్తే బాగుంటుంది కానీ రాజకీయాలు అలాగే చూడాలి అని కూడా అంటున్నారు.