Begin typing your search above and press return to search.

రోజాకు పూజల ఫలితం దక్కింది

By:  Tupaki Desk   |   10 April 2022 10:37 PM IST
రోజాకు పూజల ఫలితం దక్కింది
X
నోచిన నోముల ఫలము, చేసిన పూజల ఫలితమూ అని అన్నారు. అలా ఆర్కే రోజా చేసిన పూజలు ఫలించాయి. నిజానికి చాలా రోజులుగా చూస్తే ఆమె ఎక్కని కొండ లేదు, మొక్కని దైవం లేదు. గట్టిగా చెప్పాలీ అంటే ఆమె గత కొన్ని రోజులుగా ఆలయాల చుట్టూనే తిరుగుతున్నారు. అలాగే స్వామీజీలను కూడా కలసి దీవెనలు అందుకున్నారు.

ఇదిలా ఉండగా రోజా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంతో మొదలుపెట్టి విజయవాడ కనక దుర్గమ్మ, జొన్నవాడ కామాక్షమ్మ, శ్రీ కాళహస్తీశ్వరస్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి వారు, తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలు అన్నీ కూడా దర్శించుకున్నారు. భక్తిగా పూజలు చేశారు.

అలాగే యాగాలు కూడా చేశారు. ఇలా రోజా తన ఇంటిని మరచి కష్టాలకు ఓర్చి చేసిన పూజలు, మొక్కిన మొక్కులు ఈ రోజు ఫలించాయి. అవే చివరికి ఆమెను అమాత్య కుర్చీలో కూర్చోబెట్టబోతున్నాయి. నిజంగా మినిస్టర్ రోజా అనిపించుకోవాలి అన్నది ఆమె కోరిక. ఆమె కోరిక 2019లోనే తీరుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు అది నిజమైంది. ఒక్కోసారి సుదీర్ఘ నీరీక్షణ కూడా మంచి ఫలితాలు ఇస్తే ఆ ఆనందమే వేరు. అదే రోజా అనుభవిస్తున్నారు. మొత్తానికి ఆమె ఆర్కే రోజా కాదు, ఇపుడు మినిస్టర్ రోజా.