Begin typing your search above and press return to search.

కేశ‌వ్‌ - గాలి ప్ర‌మోష‌న్ సీక్రెట్ చెప్పిన రోజా

By:  Tupaki Desk   |   16 Sep 2015 12:31 PM GMT
కేశ‌వ్‌ - గాలి ప్ర‌మోష‌న్ సీక్రెట్ చెప్పిన రోజా
X
ఏపీ టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కులుగా ఉన్న గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు - ప‌య్యావుల కేశ‌వ్ ఇటీవ‌లే ఎమ్మెల్సీలుగా ఎన్నిక‌య్యారు. చంద్ర‌బాబు కేబినెట్‌ లో మంత్రులుగా ఎంపిక‌య్యే అర్హ‌త ఉన్న వీరిద్ద‌రు అనూహ్యంగా ఓడిపోయారు. అయితే వీరిద్ద‌రికి చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఇచ్చారు. తాజాగా వీరిద్ద‌రిపై వైకాపా ఎమ్మెల్యే ఆర్‌ కె.రోజా స‌రికొత్త విమ‌ర్శ‌లు చేశారు.

వైకాపా మ‌హిళా నేత‌ల‌కు వేధింపుల‌కు గురి చేసే నాయ‌కుల‌కు చంద్ర‌బాబు ప్ర‌మోష‌న్ ఇచ్చే సంస్కృతికి శ్రీకారం చుట్టార‌ని...ఈ నేప‌థ్యంలోనే చిత్తూరు జిల్లాలో మ‌హిళ‌ల‌ను వేధిస్తున్న గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు, అనంత‌పురం జిల్లాలో వైకాపా మ‌హిళా నేత‌ల‌ను ఇబ్బందులు పెడుతున్న ప‌య్యావుల కేశ‌వ్‌ ల‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఇచ్చార‌ని రోజా ధ్వ‌జ‌మెత్తారు.

అనంత‌పురం జిల్లా బెళుగుప్ప‌లో వైకాపా ధ‌ర్నాకు అనుమ‌తివ్వ‌క‌పోవ‌డంపై ఆమె మండిప‌డ్డారు. మ‌హిళా నేత‌ల‌ను వేధించిన వారికి చంద్ర‌బాబు మంచి పోస్టులు ఇస్తున్నార‌ని...అందుకే ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓడిపోయిన గాలి - ప‌య్యావులకు ప‌ద‌వులు ఇచ్చార‌ని....టీడీపీ నేత‌లు కావాల‌నే త‌మ పార్టీ నేత‌ల‌పై కేసులు పెడుతున్నార‌ని ఆమె ఆరోపించారు.

క‌డ‌ప జిల్లా రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ జ‌గ‌న్ అంటే చంద్ర‌బాబుకు భ‌య‌మ‌ని అందుకే వైకాపా ధ‌ర్నాల‌కు, నిర‌స‌న‌ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.