Begin typing your search above and press return to search.

బాబును క్రాస్ చేసేసిన రోజా

By:  Tupaki Desk   |   7 Feb 2017 9:34 AM GMT
బాబును క్రాస్ చేసేసిన రోజా
X
హైటెక్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని వినియోగించటంతో ఆయనకు ఆయనే సాటి అన్న పేరుంది. మరి.. అలాంటి ఆయన్ను విపక్షానికి చెందిన ఒక ఎమ్మెల్యే సోషల్ మీడియాలో క్రాస్ చేయటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

సినీనటిగా.. టీవీ యాంకరింగ్ తో పాటు.. పదునైన వ్యాఖ్యలతో అధికారపక్షంపై విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజా ఒక విషయంలో బాబును దాటిపోయారు. ఆ మాటకు వస్తే దేశంలో మరే ఎమ్మెల్యేకు లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ రోజాకు ఉందన్న విషయం తాజాగా స్పష్టమైంది. ఫేస్ బుక్ లో ఆమెకున్న ఫాలోవర్స్ ఏకంగా పది లక్షలు కావటం గమనార్హం.

తనపై వచ్చే వివాదాల్ని దూకుడుగా ఎదుర్కొనే రోజా.. విరుచుకుపడేలా మాట్లాడటం.. ప్రత్యర్థులపై మాటల తూటాల్ని విసరటంలో ఆమెకు ఆమె సాటి అని చెప్పాలి. పది లక్షల ఫాలోయర్స్ ను రీచ్ అయిన వేళ.. అభిమానులతో కలిసి కేక్ కట్ చేసిన ఆమె.. ఫేస్ బుక్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంటే ఎక్కువ ఫాలోయర్లు ఉండటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/