Begin typing your search above and press return to search.

బాధ్యత గల ఎమ్మెల్యే బద్మాష్‌ ప్రవర్తన

By:  Tupaki Desk   |   10 Jun 2019 10:50 AM GMT
బాధ్యత గల ఎమ్మెల్యే బద్మాష్‌ ప్రవర్తన
X
ప్రజా ప్రతినిధులు అన్నప్పుడు కాస్తంత హుందాగా వ్యవహరించాలి. తాము బాధ్యతయుతమైన పదవిలో ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాని బీహార్‌ రాష్ట్రంకు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీ ఎమ్మెల్యే యదువంశ్‌ కుమార్‌ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలపాలయ్యింది. ఈయన ఈశాన్య రాష్ట్రల అభివృద్ది.. అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి అద్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'ఈస్‌' అనే కమిటీలో కీలక సభ్యుడు. అలాంటి కీలక పదవిలో ఉన్న ఈయన టీనేజ్‌ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వారితో బలవంతంగా డాన్స్‌ లు వేయడం జరిగింది.

ఈస్ట్‌ కమిటీ పనిమీద తాజాగా మణిపూర్‌ వెళ్లిన ఎమ్మెల్యే యదువంశ్‌ అక్కడ పలు ప్రాంతాల్లో పర్యటించి తన గెస్ట్‌ హౌస్‌ కు చేరుకున్నాడు. అక్కడ ఇద్దరు అమ్మాయిలతో కలిసి డాన్స్‌ వేశాడు. ఆ వీడియో కాస్త వైరల్‌ అయ్యింది. అయితే ఆ వీడియోలో అమ్మాయిలు చాలా ఇబ్బందిగా ఎమ్మెల్యేతో డాన్స్‌ చేస్తున్నట్లుగా క్లీయర్‌ గా తెలుస్తోంది. దాంతో ఎమ్మెల్యే తీరుపై మహిళ సంఘాలు మరియు రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంఘటన జరిగి దాదాపు వారం రోజులు అయ్యింది. కాస్త ఆలస్యంగా వీడియో సోషల్‌ మీడియా ద్వారా జనాల ముందుకు వచ్చింది. దాంతో ఇప్పుడు ఆయన తీరుపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని ఇంపాల్‌ టైమ్స్‌ దినపత్రిక వెలుగులోకి తీసుకు వచ్చింది. ఆ సమయంలో ఎమ్మెల్యే యదువంశ్‌ తో పాటు బీహార్‌ కే చెందిన మరి కొందరు నాయకులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ నాయకుడు సచిన్‌ ప్రసాద్‌ సింగ్‌ ఇంకా జనతాదల్‌ ఎమ్మెల్యే రాజ్‌ కుమార్‌ రాయ్‌ కూడా అక్కడే ఉన్నట్లుగా ఇంపాల్‌ టైమ్స్‌ కథనంలో పేర్కొనడం జరిగింది.

ఈ కథనంపై ఎమ్మెల్యే యదువంశ్‌ మండి పడ్డాడు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రత్యర్థులు ఇలా టార్గెట్‌ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు ఆ వీడియోలో ఉన్నది తాను కాదు అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.