Begin typing your search above and press return to search.

కరోనా నా ఆశలన్నీ వమ్ము చేసిందంటున్న తెలుగు స్టార్ హీరోయిన్!

By:  Tupaki Desk   |   14 Dec 2020 1:02 PM IST
కరోనా నా ఆశలన్నీ వమ్ము చేసిందంటున్న తెలుగు స్టార్ హీరోయిన్!
X
రీతూ వర్మ చక్కటి పదహారణాల తెలుగు అమ్మాయి. ముందుగా ఈమె షార్ట్ ఫిలిమ్ 'అనుకోకుండా' సూపర్ హిట్ కావడంతో వెండితెరపై అవకాశాలు పొందింది. ఆ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. 2016లో విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ కూడా మంచి పేరు వచ్చింది. అంతేకాదు బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు కొల్లగొట్టింది. ఫిలింఫేర్ అవార్డ్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పెళ్లి చూపులు సూపర్ హిట్ కావడంతో ఇక ఆమె దశ తిరుగుతుందని అంతా భావించారు. కానీ ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ స్టార్ హీరోల్లో ఒకడిగా మారగా.. రీతూ వర్మకు మాత్రం చాలా రోజులు సరైన అవకాశాలు దక్కలేదు.

ఆ తర్వాత ఆమెకు తమిళం, మలయాళంలో వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగులో నిఖిల్ హీరోగా నటించిన కేశవ సినిమాలో నటించింది. అది ఓ మోస్తరుగా హిట్ అయ్యింది. ఈ ఏడాది ఆరంభంలో దుల్కర్ సల్మాన్ తో రీతూ వర్మ చేసిన 'కనులు కనులను దోచాయంటే' సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది. దీంతోపాటు గౌతం మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ధ్రువ నక్షత్రం అనే సినిమాలో హీరోయిన్ గా రీతూవర్మ ఎంపికైంది. అలాగే తెలుగులో శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా చేస్తున్న 'టక్ జగదీష్' లో కూడా హీరోయిన్ గా రీతూవర్మ కు అవకాశం దక్కింది.

అయితే వరుసగా అవకాశాలు దక్కినా ఈ ఏడాది తనకు నిరాశే మిగిల్చిందని తాజాగా రీతూ వర్మ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో తాను చేసిన కనులు కనులను దోచాయంటే సినిమా సూపర్ హిట్ గా నిలవగా, చేతిలో ఉన్న మరో నాలుగు సినిమాలు కూడా ఈ ఏడాది విడుదల అవుతాయని తనకు మంచి పేరు తెస్తాయని భావించానని అయితే అవన్నీ కరోనా కారణంగా పోస్ట్ ఫోన్ అవ్వడం నిరాశ మిగిల్చినట్లు వాపోయింది. ఈ ఏడాది తొలి మూడు నెలలు పలు సినిమాల షూటింగుల్లో నటించినప్పటికీ ఒక్కటి కూడా విడుదలకు నోచుకోలేక పోయిందని ఈ అమ్మడు తెగ బాధపడిపోతోంది.