Begin typing your search above and press return to search.
నల్లజాతి గే గెలుపు.. అమెరికాలో కొత్త రికార్డు
By: Tupaki Desk | 5 Nov 2020 3:00 PM ISTతాజాగా విడుదలవుతున్న అమెరికా ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికీ డెమొక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ .. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లకన్ల అభ్యర్థి ట్రంప్ మధ్య పోటీ హోరాహోరిగా కొనసాగుతున్నది. ఇప్పటికైతే బిడెన్ ముందంజలో ఉన్నారు. తాజాగా నల్లజాతికి చెందిన ఓ గే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొంది రికార్డు సాధించాడు.
యూఎస్ కాంగ్రెస్ (పార్లమెంటు)కు నల్లజాతి స్వలింగ సంపర్కుడిగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రిచీ టోరెస్ (32) గెలుపొందారు. నల్లజాతికి చెందిన ఓ గే గెలుపొందడం ఇదే ప్రథమనని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం న్యూయార్క్ సిటీ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న టోరెస్ తన సమీప ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పాట్రిక్ డెలిసెస్‌పై విజయం సాధించారు.
న్యూయార్క్‌లోని 15వ జిల్లా నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ‘అమెరికాలో ఓ కొత్త శకం మొదలైంది. నల్లజాతి గే గెలిపించి అమెరికన్లు పరిపక్వతను నిరూపించుకున్నారు. రాజకీయాల్లో లింగ బేధాలు, జాతివివక్షకు తావు లేదని నిరూపించారు. అమెరికన్ల హక్కులు కాపాడేందుకు నా వంతు కృషి చేస్తా’ అని టోరెస్ విజయం అనంతర పేర్కొన్నారు. టోరెస్ 2013 నుంచి సిటీ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. తాజా ఎన్నికల్లో మరో నల్లజాతి స్వలింగ సంపర్కుడైన మాండెయిర్ జోన్స్ (33) కూడా పోటీపడ్డారు. అయితే వెస్ట్‌చెస్టర్ కౌంటీ నుంచి జోన్స్ కాంగ్రెస్‌కు పోటీపడగా ఇంకా ఫలితాలు రాలేదు. జోన్స్ కూడా విజయం సాధిస్తే కనుక అమెరికా కాంగ్రెస్‌కు ఇద్దరు స్వలింగ సంపర్కులు ఎన్నికైనట్టు అవుతుంది.