Begin typing your search above and press return to search.

పెరుగుతున్న థైరాయిడ్​ క్యాన్సర్​.. లక్షణాలు ఇవే..!

By:  Tupaki Desk   |   31 Jan 2021 7:00 AM IST
పెరుగుతున్న థైరాయిడ్​ క్యాన్సర్​.. లక్షణాలు ఇవే..!
X
క్యాన్సర్​ మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా అనేకమంది బలి అవుతున్నారు. ఈ వ్యాధి మెల్లమెల్లగా శరీరం అంతా విస్తరించి ప్రాణాలను కబలించి వేస్తున్నది. ముందు కేవలం పట్టణప్రాంతాల వాళ్లు, ఉన్నత వర్గాల ప్రజలకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి మెల్లమెల్లగా అన్నివర్గాలకు పాకుతున్నది. ఇప్పుడు చాలా చిన్న వయసు వాళ్లు కూడా క్యాన్సర్​ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో థైరాయిడ్​ క్యాన్సర్​ ఎంతో వేగంగా విస్తరిస్తున్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మనదేశంలోనూ థైరాయిడ్​ క్యాన్సర్​ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.

గత 35 ఏళ్లలో థైరాయిడ్​ క్యాన్సర్​ ప్రభావం మూడురెట్లు పెరిగిందని అధ్యయనాల్లో తేలింది. ప్రతి మనిషికి మెడభాగంలో థైరాయిడ్​ గ్రంథి ఉంటుంది. హార్మోన్లను ఉత్పత్తి చేయడం ఈ గ్రంథి పని. అయితే ప్రస్తుతం అనేకమందికి ఈ థైరాయిడ్​ గ్రంథికి క్యాన్సర్​ సోకుతున్నది. పురుషులతోపాటు స్త్రీలు కూడా ఈ వ్యాధి బారినపడుతున్నారు. 35–60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు, పురుషుల్లో ఈ వ్యాధి కనిపిస్తున్నది.

అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం.. ఇమ్యూనిటి తక్కువగా ఉండటం.. మెడికల్ డయాగ్నస్టిక్స్ నుండి వచ్చే రేడియేషన్ థైరాయిడ్ క్యాన్సర్‌కు ప్రధాన అంశాలని నిపుణులు అంటున్నారు. జన్యుపరమైన ఇబ్బందుల వల్ల కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు.

థైరాయిడ్​ క్యాన్సర్ లక్షణాలు ఇవే..!
ముందుగా మెడ భాగంలో ఎటువంటి నొప్పిలేని ఓ గడ్డ ఏర్పడుతుంది. ఆ తర్వాత మెడ వాస్తుంది. కొంతకాలానికి మింగడానికి కూడా ఇబ్బంది కలగొచ్చు.

చికిత్స ఏమిటంటే..
ఒకవేళ ఎవరికైనా థైరాయిడ్​ గ్రంథికి క్యాన్సర్​ సోకితే .. ఈ గ్రంథిని పూర్తిగా తొలగించాల్సిందే. థైరాయిడ్​ క్యాన్సర్​ను ప్రారంభంలో గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్​ను సంప్రదించడం సులభం.