Begin typing your search above and press return to search.

పోలండ్ వల్ల పెరిగిపోతున్న టెన్షన్

By:  Tupaki Desk   |   10 March 2022 11:30 AM GMT
పోలండ్ వల్ల పెరిగిపోతున్న టెన్షన్
X
పోలండ్ చేసిన ఒక ప్రకటన నాటో దేశాలతో పాటు యావత్ ప్రపంచంలో సంచలనంగా మారింది. గడచిన 14 రోజులుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయమూ పోలండ్ ప్రధానమంత్రి మాథ్యూస్ మొరావీ మాట్లాడుతూ ఉక్రెయిన్ కు యుద్ధ విమానాలను అందించటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తమ దగ్గరున్న మిగ్-29 మిగ్ యుద్ధ విమానాలను ఉక్రెయిన్ కు అందించేందుకు రెడీగా ఉన్నట్లు చేసిన ప్రకటన ఇపుడు కలకలం రేపుతోంది.

ఒకవైపు ఉక్రెయిన్ ను అన్నివైపుల నుంచి రష్యా దిగ్భందించేస్తోంది. ఇప్పటికే చాలా నగరాల్లో విధ్వంసం సృష్టించింది. రెండువైపులా నష్టాలు భారీగానే జరిగినప్పటికీ పెద్ద దేశం కాబట్టి ప్రపంచ దేశాల దృష్టి రష్యా నష్టాలపైనే కేంద్రీకృతమయ్యుంది. తమకు జరిగిన నష్టాన్ని, ఎక్కువ కాలం యుద్ధం చేయలేమన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యుద్ధ విరమణకు దాదాపు మొగ్గు చూపుతున్నారు.

ఈ రోజే రేపో యుద్ధం ఆగిపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇంతలో పోలండ్ హఠాత్తుగా ఉక్రెయిన్ కు యుద్ధ విమానాలను అందించబోతున్నట్లు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలను అందించాయే కానీ సైన్యాన్ని పెద్దగా పంపలేదు.

ఈ విషయంలోనే జెలెన్ స్కీ చాలాసార్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. రష్యా హెచ్చరికలతో నాటో దేశాలు వెనుకంజ వేశాయనే చెప్పాలి. ఒక దశలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదేమో అన్నట్లుగా వాతావరణం ఉద్రిక్తంగా మారిపోయింది.

తాజాగా పోలండ్ చేసిన ప్రకటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. ఎవరైనా ఉక్రెయిన్ కు సాయం చేస్తే ఆదేశం కూడా తమపై యుద్ధానికి దిగినట్లుగానే రష్యా భావిస్తుందని హెచ్చరించారు. దాంతో అమెరికా నాటో దేశాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఏకపక్షంగా పోలండ్ యుద్ధ విమనాలను అందించాలని తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి.

పోలండ్ నిర్ణయం అమల్లోకి వస్తే చాలా ఉపద్రవాలు జరుగుతాయని అమెరికా హెచ్చరించింది. మరి నాటో దేశాలు, రష్యా హెచ్చరికలను పోలండ్ పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.