Begin typing your search above and press return to search.
‘కాల్ మనీ’.. మళ్లీ కోరలు చాస్తోంది
By: Tupaki Desk | 21 Dec 2020 4:30 PM GMT‘కాల్ మనీ’.. ఈ కేసుల కల్లోలం ఏపీలో ఎంతటి కల్లోలం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అప్పుల పేరుతో నిలువుదోపిడీ చేసిన ఈ దందా ఎంతో మంది అమాయకులను బలితీసుకుంది. కొందరైతే ఇళ్లు వాకిలి అమ్ముకొని నానా అగచాట్లు పడ్డారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఈ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో రోజురోజుకు కాల్ మనీ లోన్ యాప్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పరిధిలో ఆదివారం ఒక్కరోజే 33 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో 39 కేసులు నమోదయ్యాయని తెలిసింది. రాచకొండ పరిధిలో 30 కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆదివారం ఒక్కరోజే ఏకంగా 100కు పైగా కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.
వివిధ యాప్ లు, కంపెనీలు.. తమ వద్ద డబ్బులు తీసుకున్న కస్టమర్లను నానా బూతులు తిడుతూ ఫోన్ లో బెదిరిస్తున్నారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లోని మహిళలకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో రుణాల ప్రతినిధులు మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ లోని కాంటాక్టులను ట్రేస్ చేసి అందరికీ మెసేజ్ లు పంపి పరువు తీస్తున్నారని ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లోన్ సంస్థల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అయితే చైనా నుంచే ఈ కంపెనీలు ఎక్కువగా ఉండడంతో పోలీసులు ఆ సంస్థ ప్రతినిధులను ఆరాతీస్తున్నారు.
ఇటీవల తెలంగాణలో ఈ యాప్స్ ద్వారా లోన్ తీసుకున్న బాధితులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవడంతో వీటిపై పోలీసులు నజర్ పెంచారు. ఈ క్రమంలోనే కేసులు బయటపడుతున్నాయి.