Begin typing your search above and press return to search.

యూపీ ఎన్నికల పై పెరిగిపోతున్న బెట్టింగులు

By:  Tupaki Desk   |   25 Feb 2022 5:32 AM GMT
యూపీ ఎన్నికల పై పెరిగిపోతున్న బెట్టింగులు
X
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై దేశంలోని ముఖ్యమైన నగరాల్లో బెట్టింగుల జోరు బాగా పెరిగిపోతోంది. పోలింగ్ కు మందు రోజుకు వచ్చేసరికి బెట్టింగు బాగా పెరిగిపోతోందట. యూపీలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అనే విషయం నుండి ఏ ప్రాంతంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? పలానా నియోజకవర్గంలో గెలవబోయే అభ్యర్థి ఎవరు ? విషయాలతో పాటు ఏ సామాజిక వర్గం ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తుంది ? అనే విషయాలపైన కూడా ఈసారి బెట్టింగులు పెరిగిపోతున్నాయి.

యూపీ ఎన్నికల కేంద్రంగా హైదరాబాద్, ముంబాయి, నోయిడా, అహ్మాదాబాద్, ఢిల్లీ నగరాల్లో సుమారు రూ. 5 వేల కోట్ల విలువైన బెట్టింగులు జరిగినట్లు సమాచారం. ముంబాయ్ కేంద్రంగా బెట్టింగ్ జరుగుతున్న విషయాన్ని ముంబాయి పోలీసులే యూపీ పోలీసులకు సమాచారం ఇచ్చారట. బెట్టింగ్ ను కంట్రోల్ చేయటంలో తమకు సహాకారం అందించాటలని యూపీ పోలీసులను ముంబాయి పోలీసులు రిక్వెస్టు చేసినట్లు యూపీ పోలీసులు చెప్పారు.

ఎస్పీ+ఆర్ఎల్డీ కూటమికి పశ్చిమ యూపీలో 50 శాతం లోపు సీట్లు వస్తుందని ఎవరైనా బెట్టింగు పెడితే వాళ్ళకు రూపాయికి 5 రూపాయలు వస్తాయట.

అలాగే 50 శాతంకు పైగా సీట్లు వస్తాయని బెట్టింగులు పెట్టిన వారికి రూపాయికి రూపయిన్నర దక్కుతుందట. బీజేపీనే అధికారంలోకి వస్తుందని బెట్టింగులు కాస్తున్నవారికి రూపాయికి రూపాయి వస్తుందట. మొత్తానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పెద్ద పెద్ద బెట్టింగ్ సంస్థలు హ్యాపీగా బెట్టింగులు ఆడేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అయితే ఒక రాష్ట్రంలో జరుగుతున్న బెట్టింగును కంట్రోల్ చేసేందుకు యూపీ పోలీసులు బయట రాష్ట్రాలకు వెళ్ళి సహకరించేత సీన్ లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడి పోలీసులు యూపీ పోలింగ్ కే సరిపోవటం లేదు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, అతి, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు యూపీలో చాలానే ఉన్నాయట. ఇలాంటి పోలింగ్ కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలను ఉపయోగించాల్సుంటుంది. కాబట్టి యూపీ పోలీసులు బయట రాష్ట్రాల్లో జరిగే బెట్టింగుల గురించి పట్టించుకునే పరిస్ధితుల్లో లేరు.