Begin typing your search above and press return to search.

రిషి సునక్ పేరు, కులంపై సోషల్ మీడియాలో ఆరా?

By:  Tupaki Desk   |   25 Oct 2022 4:51 AM GMT
రిషి సునక్ పేరు, కులంపై సోషల్ మీడియాలో ఆరా?
X
మనల్ని 200 ఏళ్లకుపైగా నిరంకుశంగా పాలించిన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని మన భారతీయుడే పాలించే రోజు రానేవచ్చింది. రుషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా కావడంతో భారత్ లో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే కొందరు నెటిజన్ల గుణం మాత్రం పోలేదు. కొత్తగా ఎన్నికైన బ్రిటీష్ ప్రధానమంత్రిని రిషి సునక్ ఎవరు? ఎక్కడి వారు? మన కులపోడేనా? అని ఆరాతీస్తున్నారు. చాలా మంది హిందూ పేరు నిపుణులు అది 'సౌనక్' అని ఉండాలి కానీ సునక్ కాదు అని అంటున్నారు.

సునక్ అనే పేరుకు సంస్కృతంలో 'కుక్క' అని అర్ధం, అయితే సౌనక్ అంటే హిందూ పురాణాలలో ఒక సాధువు పేరు. కొత్తగా ఎన్నికైన బ్రిటన్ ప్రధాని పేరుపై సోషల్ మీడియా వేదికల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి.

భారతదేశంలో సర్వసాధారణంగా జరిగినట్లుగా బ్రిటిష్ విద్యా రికార్డులలో అతని పేరు తప్పుగా రాసి ఉండవచ్చని కొందరు ఊహిస్తున్నారు. అయితే కొందరు సునక్ అనేది పంజాబ్‌లోని అతని పూర్వీకుల ఇంటి పేరు , హిందూ పురాణాల రిషి సౌనక్‌తో సంబంధం లేదని ఉదహరిస్తున్నారు.

ఇది పక్కన పెడితే చాలా మంది భారతీయులు కొత్తగా ఎన్నికైన బ్రిటీష్ ప్రధాని కులం కోసం ఆసక్తిగా వెతుకుతున్నారు. ఇదే గూగుల్ లో ట్రెండింగ్ గా మారింది. వాస్తవానికి అతను బ్రాహ్మణుడైన అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నాడు, అయితే రిషి కులం ఇంకా ఎవరికీ తెలియదు. ఆయన పంజాబీ అని అంటున్నారు.

రిషి సునక్ శాఖాహారుడు.. టీటోటేలర్ అని తెలిసి, అసలు కులాన్ని ప్రజలకు వెల్లడించనప్పటికీ, అతను బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతున్నాడని చాలా మంది భావిస్తున్నారు. అయితే బ్రాహ్మణుడు అని ఎవరూ నిర్ధారించలేదు.

ఇలా అత్యున్నత పీఠం అధిరోషించిన మన రిషిని కులం పేరుతో కొందరికే పరిమితం చేసి గొప్పలు చెప్పుకునే నీచ సంస్కృతి మొదలైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.