Begin typing your search above and press return to search.

తెల్లదొరల తెలివి మాములుగా లేదుగా!

By:  Tupaki Desk   |   5 Sep 2020 4:30 AM GMT
తెల్లదొరల తెలివి మాములుగా లేదుగా!
X
ఎంతైనా బ్రిటీషోళ్లు.. బ్రిటీషోల్లేనండి. వాళ్ల తెలివి మాములుగా ఉండదు. ఎటువంటి ఆపత్కాలంలోనైనా తెలివిగా వ్యవహరించి గట్టెక్కడం వాళ్లకు వెన్నతోపెట్టిన విద్య. తాజాగా కరోనా దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా ఆతిథ్యరంగం కుదైలైన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం బ్రిటన్​ మీద కూడా పడింది. అక్కడి రెస్టారెంట్లు, హోటళ్లకు గిరాకి లేక మూసేసి పరిస్థితి ఏర్పండింది. ఇప్పటికే కొందరు హోటళ్ల యజమానులు అద్దెలు కట్టలేక హోటళ్లు మూసేశారు. దీంతో హోటల్​రంగాన్ని ఏదో రకంగా గాడిలో పెట్టాలని బ్రిటన్​ ఛాన్స్​లర్​ రిషీ సునాంక్​ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆ కార్యక్రమం పేరు ఏంటంటే ‘ఈట్​ ఔట్​.. హెల్ప్​ ఔట్​’ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం బ్రిటీషర్లందరూ బయటకు వచ్చి రెస్టారెంట్లలోనే తినాలి. ఇందుకోసం పలు రెస్టారెంట్లు భారీ డిస్కౌంట్లు కూడా ప్రకటించాయి. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. బ్రిటిషర్లు ఈ మధ్యకాలంలోనే ఏకంగా 10 కోట్ల సార్లు బయటకు వచ్చి రెస్టారెంట్లలోనే తిన్నారట.

ఫ్యామిలీలతో మీల్స్ చేసేవారికి పలు హోటళ్లు 50 శాతం వరకు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేశాయి. దీంతో ప్రజలు ఎగబడ్డారు. అలాగే సాఫ్ట్ డ్రింక్స్ పై 10 పౌండ్ల వరకు డిస్కౌంట్ ప్రకటించారు. ఈ కార్యక్రమం సక్సస్ కావడంతో రెస్టారెంట్లలో బుకింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. గతంలోనూ రిషీ ఇటువంటి ప్రకటనే చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అదేంటంటే అందరూ బయటకు వెళ్లండి ఆఫీసులకు వెళ్లండి, షాపింగ్​కు వెళ్లండి అప్పుడే మనదేశ ఆర్థికవ్యవస్థ బాగుపడుతుంది అని దీనికి విశేష స్పందన వచ్చింది. ‘నేను ఇచ్చిన ఈట్​ ఔట్​.. హెల్ప్​ ఔట్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. సోమవారం నాటికి 84,700 రెస్టారెంట్లలో 1,30 వేల బుకింగ్స్ నమోదయ్యాయి. బ్రిటన్‌లో ఆర్థిక తిరిగి పుంజుకోవడానికి దోహద పడుతుందని అంచనా వేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు రిషీ సునాంక్​.