Begin typing your search above and press return to search.

ధోని - పంత్.. ఒక కుక్క కథ..

By:  Tupaki Desk   |   26 Oct 2019 10:59 AM GMT
ధోని - పంత్.. ఒక కుక్క కథ..
X
ఇద్దరూ వికెట్ కీపర్లే.. ఇద్దరూ నైపుణ్యం గల వారే.. ఒకరేమో టీమిండియాకు కెప్టెన్ అయ్యి రెండు ప్రపంచకప్ లు అందించి భారత క్రికెట్ కు దేవుడిగా మారిపోయాడు. మరికొరు ఏమో ఎంతో నైపుణ్యం ఉన్నా టీమిండియాలో ఆడినా అంతగా క్లిక్ కాలేదు. కానీ ఇప్పుడు వారిద్దరూ కలిశారు. ఓ కుక్కతో ఆడుకున్నారు. ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది.

టీమిండియా క్రికెట్ లో అవకాశం వచ్చినా రాణించకుండా ఫెయిల్ అయిన రిషబ్ పంత్ తాజాగా రాంచీలోని ధోని నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. దిగ్గజ క్రికెటర్ ధోని వారసుడిగా రిషబ్ పంత్ టీమిండియాలోకి వచ్చాడు. పంత్ భవిష్యత్ కు బాటలు వేయడం కోసం ధోని ఏకంగా కొన్ని సిరీస్ లకు దూరంగా ఉండి చాన్స్ ఇచ్చాడు. కానీ రిషబ్ పంత్ మాత్రం దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దీంతో ఇప్పుడు దక్షిణాఫ్రికాతో సిరీస్ లో స్థానం కోల్పోయాడు. వృద్ధిమాన్ సాహా తాజాగా పంత్ స్థానంలో జట్టులోకి వచ్చాడు.

దీంతో రిషబ్ పంత్ తన భవిష్యత్ పై గందరగోళంతోనే ధోనిని కలిసి సలహాలు, సూచనలు తీసుకోవడానికే ధోనిని కలిసినట్టు అర్థమవుతోంది. ఈ ఫొటో వైరల్ గా మారింది. ఆ ఫొటోపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కీపింగ్ లో, బ్యాటింగ్ లో ధోని వద్ద సూచనలు, సలహాలు తీసుకుంటున్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేస్తున్నారు.

తాజాగా బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. టీ20లకు, టెస్ట్ సిరీస్ లకు ప్రకటించిన జట్టులో రిషబ్ పంత్ కు చోటున్నా.. రెగ్యులర్ వికెట్ కీపర్ , బ్యాట్స్ మెన్ గా ‘సంజు శాంసన్’ ను తీసుకున్నారు. ఈ పరిణామం రిషబ్ పంత్ కు షాకింగ్ లా మారింది. ఆడకుంటే తొలగించడం ఖాయమన్న హెచ్చరికగా దీన్ని భావిస్తున్నారు. అందుకే దిగ్గజ క్రికెటర్ ధోని సలహా కోసం రిషబ్ పంత్ రాంచీకి వచ్చినట్టు అర్థమవుతోంది.