Begin typing your search above and press return to search.

పంత్​ ది స్వయంకృతాపరాధం ఇక ఎంట్రీ కష్టమే!

By:  Tupaki Desk   |   8 Dec 2020 1:19 PM IST
పంత్​ ది స్వయంకృతాపరాధం ఇక ఎంట్రీ కష్టమే!
X
టీం ఇండియా క్రికెటర్​ రిషబ్​ పంత్​ కెరీర్​ చాలా డేంజర్​లో ఉందని.. అతడికి ఫ్యూచర్​ లేదని మాజీ క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా వ్యాఖ్యానించాడు. పంత్​ తన క్రికెట్​ కెరీర్​ను చే జేతులారా నాశనం చేసుకున్నాడని చెప్పాడు. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వదిలిపెడితే బాగుపడతాడని.. లేదంటే త్వరలోనే అతడిని బీసీసీఐ పక్కన పెడుతుందన్నాడు. ప్రస్తుతం అతడు టెస్టులకు మాత్రమే ఎంపికయ్యాడని.. భవిష్యత్ లో ఆ అవకాశం కూడా ఉండక పోవచ్చని పేర్కొన్నాడు.

పంత్​ వికెట్​ కీపర్ గా ధోనీని రీ ప్లేస్​ చేస్తాడని అంతా భావించారు. మొదట్లో బ్యాటింగ్​ లో కూడా బాగా రాణించాడు. కానీ రాను రాను అతడి ఆటతీరులో ఎంతో మార్పు వచ్చింది. నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. దీంతో పంత్​ను బీసీసీఐ లైట్​ తీసుకుంది. దానికి తోడు కేఎల్​ రాహుల్​, వృద్ధిమాన్​ సాహా లాంటి వికెట్​ కీపర్లు బ్యాటింగ్​ లో రాణించారు. నిలకడగా ఆడుతూ జట్టు విజయాలకు కీలకంగా వ్యవహరించారు. దీంతో పంత్​ భవిష్యత్​ ప్రమాదంలో పడింది. ఈ విషయం పైనే తాజాగా ఆకాశ్​చోప్రా స్పందించాడు. ఆయన ఇంకా ఏమన్నాడంటే..

‘పంత్​ ఇలాగే ఆడితే టెస్టుల్లో కూడా అవకాశం ఉండదు. ఆసీస్‌- ఏతో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ ఇండియా- ఏ తరపున పంత్‌ స్థానంలో సాహాకు స్థానం లభించిందంటే మనకు విషయం అర్థమై ఉండాలి. ఇప్పటికీ అతడికి అవకాశం ఉంది. తానేంటో నిరూపించుకునేందుకు ఆసిస్​ టూర్​ కలిసివచ్చింది. ఈ టూర్​ లోనైనా రాణిస్తే అతడు తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడు. గత ఐపీఎల్​ సీజన్​ లోనూ పంత్​ పెద్దగా రాణించలేదు. ఒకటి రెండు మ్యాచ్​ల్లో తప్ప అతడు మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. కాబట్టి పంత్​ ఇప్పటికైనా బద్ధకాన్ని వదులుకోవాలి. లేదంటే అతడి కెరీర్​ నాశనం అయినట్టే’ అని ఆకాశ్​ చోప్రా వ్యాఖ్యానించాడు.