Begin typing your search above and press return to search.

ముకేష్ అంబానీ ఐడియా.. దేశాన్ని మార్చేస్తుందా?

By:  Tupaki Desk   |   30 Jan 2020 4:30 PM GMT
ముకేష్ అంబానీ ఐడియా.. దేశాన్ని మార్చేస్తుందా?
X
దేశం ఆర్థిక మాంద్యం తో అతలాకుతలం అవుతున్నా సావుకార్ల వద్ద మాత్రం కాసుల గలగలలు వినిపిస్తూనే ఉంటుంది. వారి వ్యాపార పోకడలు అలాంటివి మరీ.. దేశంలోనే సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత కూడా దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక మందగమనంతో కొట్టు మిట్టాడుతున్నా ఆయన మాత్రం జియో సహా ఆయన వ్యాపారాల్లో లాభాలతో లాభాలపంట పండిస్తున్నారు.

ఇప్పటికే ఎన్నో వ్యాపారాల్లో అడుగు పెట్టి కోట్ల కు పడగలెత్తిన ముకేష్ అంబానీ తాజాగా కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. దేశాన్ని పర్యవరణాన్ని కాపాడేందుకు గొప్ప ఐడియాతో ముందుకెళ్తున్నారు. వాడేసిన ప్లాస్టిక్ తో రోడ్డువేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. దీన్ని కొత్త వ్యాపారంగా ఎంచుకున్నారు.

మహారాష్ట్రలోని ఒక ప్రాంతం లో టెస్టింగ్ కోసం 40కి.మీల రోడ్ ను వేశారు. అది సక్సెస్ కావడంతో ప్రపంచానికి పెను భారమైన ప్లాస్టిక్ తో రోడ్డు వేయాలనే కొత్త బిజినెస్ కు పురుడు పోశారు.

దేశంలో ఎక్కువగా బీటీ రోడ్లు (బిటుమిన్) వేస్తారు. అయితే ఇందులోనే కొంత రీ సైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ కలిపి కూడా వేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఏటా వాడి పారేసిన 25940 టన్నుల ప్లాస్టిక్ తయారవుతోందని.. ఇది పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తోందని.. దీన్ని సేకరించి రీసైకిలింగ్ చేస్తే దేశమంతా ప్లాస్టిక్ రోడ్లు వేయవచ్చని రిలయన్స్ స్కెచ్ గీసింది.

ప్రపంచవ్యాప్తంగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్టవచ్చని.. రోడ్లకు వాడి పారేసిన ప్లాస్టిక్ ను రీసైకిల్ చేసి వాడితే పర్యావరణానికి మేలు చేకూర్చుని వారము అవుతామని ముకేష్ అంబానీ ఈ మహత్కార్యానికి పూనుకున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల అథారిటీకి ప్లాస్టిక్ రోడ్లపై ప్రతిపాదన పంపారు. ఇది అమల్లోకి వస్తే ఇక దేశంలో ప్లాస్టిక్ రోడ్డు వచ్చేస్తాయి. ఎక్కువ కాలం మన్నే వీటి వల్ల పర్యావరణానికి ఉపయోగం.. ఇటు మానవళికి ఉపయోగం.. ఎంతైనా ముకేష్ ది బుర్రే బుర్రే కదా..