Begin typing your search above and press return to search.
గణపతి గొలుసు వేసుకున్న రిహన్నా.. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఫైర్!
By: Tupaki Desk | 17 Feb 2021 5:00 AM ISTమోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు పాప్ స్టార్ రిహన్నామద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. పలువురు సెలబ్రిటీలు ఇది తమ సొంత విషయం అని స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా.. రిహన్నాను మరో విషయంలో టార్గెట్ చేశారు కొందరు.
రిహన్నా తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫొటోలో.. ఆమె టాప్‌లెస్‌గా కనిపించింది. ఆమె మెడలోని నెక్లెస్‌కు విఘ్నేశ్వరుని ప్రతిమ ఉంది. ఆ వినాయకుడి ప్రతిమ వజ్రాలతో తయారు చేసి ఉంది. ఆమె టాప్ లెస్ పోజులో కనిపించిన సమయంలో వినాయకుడి బొమ్మ మెడలో ఉందని, ఇది హిందూ దేవుళ్లను అవమానించడమేనని కొందరు కామెంట్ చేశారు.
విఘ్నేశ్వరుడిని హిందువులు పూజిస్తారని, గణేశుని ప్రతిమను నెక్లెస్‌లో పెట్టుకోవడం ఎందుకు? అని కొందరు ప్రశ్నించారు. మరొకరు హిందూ మతాన్ని, సంస్కృతిని వాడుకుంటున్నారని, దీన్ని మానుకోవాలని సూచించారు. ఇక మరొక నెటిజన్ అయితే.. ఇది హిందుత్వాన్నే ఎగతాళి చేయడమేనని అన్నారు.రైతుల నిరసనలకు మద్దతు పలుకుతూ ట్వీట్ చేసిన పాప్ స్టార్.. ''మనం దీని గురించి ఎందుకు మాట్లాడ కూడదు..?'' అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా చాలా మంది ఆమెను తప్పుబట్టారు.