Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా ధనవంతురాలు ఈమె

By:  Tupaki Desk   |   8 Oct 2021 5:23 PM IST
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా ధనవంతురాలు ఈమె
X
ధనవంతుల జాబితా రిలీజ్ అయ్యింది. ఈ జాబితాలో ఆశ్యర్యకరంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా ధనవంతురాలుగా ఎవరో తెలిసింది. వెల్త్ హరున్ ఇండియా రిచ్ లిస్ట్-2021 జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీమంతుల్లో ఇద్దరు మహిళలు ఉండడం విశేషం.

ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ -ఈ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక మహిళగా అవతరించింది. ఆమె నికర సంపద విలువ రూ.7700 కోట్లు. మొత్తం భారతదేశంలోని సంపన్నుల జాబితాలో మహిహ 231వ ర్యాంకు సాధించారు.

లండన్ లోని వెబ్ స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ మెంట్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన 44 ఏళ్ల మహిమా 2001 నుంచి బయోలాజికల్-ఈ బాధ్యతలు చేపట్టారు. ఆమె తాతలు 1948లో స్థాపించిన బయోలాజికల్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థ మొదటిసారి రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి 'హెపారిన్' అనే ఔషధాన్ని తాయరు చేసింది. ప్రస్తుతం ఇదే సంస్థను మహిమ ఉన్నత శిఖరాలకు చేర్చారు.

ఈ ఏడాది హరున్ ఇండియా రిచ్ లిస్ట్ లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన 69మంది వ్యక్తులు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న వారి మొత్తం సంపద తెలుగు రాష్ట్రాల నుంచి రూ.3,79,200 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 54శాతం పెరగడం గమనార్హం.