Begin typing your search above and press return to search.

125 కోట్ల మందిలో 1.5 లక్షల మంది మాత్రమే..

By:  Tupaki Desk   |   8 Feb 2019 1:00 PM GMT
125 కోట్ల మందిలో 1.5 లక్షల మంది మాత్రమే..
X
భారతదేశ అభివృద్ది చెందుతున్న దేశం - సంవత్సరం సంవత్సరంకు భారత్‌ వృద్ది రేటు పెరుగుతుందని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. కాని భారత్‌ లో కోటీశ్వరుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగడం లేదని తాజాగా డైరెక్ట్‌ ట్యాక్స్‌ సెంట్రల్‌ బోర్డు చైర్మన్‌ సుశీల్‌ చంద్ర విడుదల చేసిన నివేదిక ద్వారా వెళ్లడైంది. 125 కోట్ల జనాబా ఉన్న మన దేశంలో కోటీశ్వరులు కేవలం 1.5 లక్షల మంది మాత్రమే అంటూ సుశీల్‌ చంద్ర ప్రకటించారు.

2018 - 19 సంవత్సరానికి గాను వార్షిక ఆదాయం కోటి రూపాయలు దాటింది అంటూ రిటర్న్‌ దాఖలు చేసిన వారు కేవలం 1.5 లక్షల మంది మాత్రమేనంటూ ఆయన ఒక సదస్సులో పేర్కొన్నారు. భారత్‌ వంటి దేశంలో ఈ సంఖ్య చాలా తక్కువ. జీడీపీ - వినయోగం విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో కేవలం 1.5 లక్షల మంది మాత్రమే రిటర్న్‌ దాఖలు చేయడం విచారించదగ్గ విషయమన్నారు. 2014-15 సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం 69 వేలు మాత్రమే ఉండేదని - నాలుగేళ్లలో ఇంతగా పెరగడం జరిగిందని అన్నారు. ఇందులో ఎక్కువగా వేతన జీవులే ఉన్నారట.

వ్యాపారాలు చేసుకునే వారు తమ డబ్బును బ్లాక్‌ మనీగా మార్చి లెక్కల్లోకి రాకుండా చేస్తూ కోట్లు ఉన్నా కూడా లేనట్లుగా రిటర్న్‌ లు దాఖలు చేస్తున్నారు. వేతన జీవులకు మాత్రం తమ మొత్తం జీతం చూపించుకోక తప్పదు. అందుకే రిటర్న్‌ లు దాఖలు చేసే వారు ఎక్కువగా వేతన జీవులు ఉంటారు. ఈ సంవత్సరంలో పన్ను చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశించామని - కాని అది కూడా సాధ్యం కాలేదని సుశీల్‌ చంద్ర అన్నారు.