Begin typing your search above and press return to search.

పరీక్షలుపై స్పందించిన వర్మ.. జగన్ చిల్ అంటూ ట్వీట్!

By:  Tupaki Desk   |   1 May 2021 7:00 PM IST
పరీక్షలుపై స్పందించిన వర్మ.. జగన్ చిల్ అంటూ ట్వీట్!
X
ఈ మధ్య సామాజిక సమస్యలపై స్పందిస్తున్న రాంగోపాల్ వర్మ అటు ప్రధాని మోడీ, అమిత్ షాను కుంభమేళా, ఎన్నికలు నిర్వహించినందుకు ట్విట్టర్ లో కడిగేశాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న సీఎం జగన్ పై పడ్డారు.

సాధారణంగా టీడీపీని, చంద్రబాబును తిడుతూ జగన్ ను అభిమానించే వర్మ తాజాగా సీఎం జగన్ పదోతరగతి పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయంపై సెటైర్లు వేశారు. ఆర్జీవీ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి.

పదోతరగతి పరీక్షలను వాయిదా వేస్తే 90శాతం మంది స్టూడెంట్స్ సూపర్ హ్యాపీగా ఫీలవుతారని వర్మ ట్వీట్ చేశాడు. 90శాతం స్టూడెంట్స్ నా మాదిరిగానే బ్యాడ్. వాళ్లందరూ ఎప్పుడూ పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటారు. బుద్దిగా చదువుకొని 10శాతం మంది.. 90శాతం మంది చదవక వారి కింద పనిచేస్తారు. కాబట్టి చిల్ కావాలని వైఎస్ జగన్ కు సలహా ఇస్తున్నాను.. అంటూ వర్మ ట్వీట్ చేశారు.

కరోనా బారిపడకుండా ఉంటారా? పరీక్షలు కావాలా అనే ఆప్షన్ విద్యార్థులకు ఇస్తే అందరూ మొదటి దానికే మొగ్గుచూపుతారని.. వాళ్లకు స్టడీస్ కంటే జీవితం ముఖ్యమని భావిస్తారని వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు.