Begin typing your search above and press return to search.

వైరల్ పిక్: వర్మ ‘కరోనా వాట్సప్ గ్రూప్’ పోస్టు

By:  Tupaki Desk   |   27 March 2020 7:35 AM GMT
వైరల్ పిక్: వర్మ ‘కరోనా వాట్సప్ గ్రూప్’ పోస్టు
X
చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని కబళిస్తోంది. అమెరికాను పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ చైనా సృష్టియే అనే వాళ్లు ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు. ఎందుకంటే వైరస్ పుట్టిన చైనాలో ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఇతర దేశాల్లో వ్యాపిస్తోంది. వేల మందిని చంపుతోంది.

చైనాను ఈ వైరస్ ను పుట్టించిందని.. అమెరికా సహా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసేందుకే ఈ వైరస్ ను ప్రపంచం మీదకు వదిలిందని విమర్శలొస్తున్నాయి. స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం దీన్ని చైనీస్ వైరస్ అంటూ ఆడి పోసుకుంటున్నారు.

కరోనాతో ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలి లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ప్రపంచ పెద్దన్న అమెరికా సైతం కుదేలైంది. ఇప్పుడు చైనా సూపర్ పవర్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో చైనాలో పుట్టిన కరోనా వైరస్ పై సోషల్ మీడియా లో వేల జోకులు, మీమ్స్ వచ్చిపడుతున్నాయి. చాలా మంది తమ క్రియేటివిటీని జోడించి తెగ సృజనాత్మకంగా చైనాను ఏకిపారేస్తున్నారు.

తాజాగా రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్టును షేర్ చేశాడు. చైనా కరోనా అనే వైరస్ వాట్సాప్ గ్రూపు సృష్టించి.. ప్రపంచాన్ని యాడ్ చేసి తను ఎక్సిట్ అయిపోతుంది. వాట్సాప్ లో ఎవరో తుంటరి చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. వర్మ కు ఇది బాగా నచ్చి షేర్ చేయడంతో చైనా కుట్రపై నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. మీరూ చూడండి.. వర్మ చేసిన ఈ పోస్టు పై మీరూ ఓ లుక్కేయండి..