Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి 'ఆర్జీవీ' కౌంటర్ అదిరిపోయింది..

By:  Tupaki Desk   |   4 Jan 2022 5:30 AM GMT
ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ కౌంటర్ అదిరిపోయింది..
X
ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్ల తగ్గింపుపై వివాదం రోజరోజుకు ముదురుతోంది. తాజాగా సీన్లోకి సంచలనాల దర్శకుడు రామ్ గోపార్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. ఏపీ ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే సినిమావాళ్లు ఏ విధంగా నష్టపోతారో పంచ్ లతో వివరించారు. పేదవాడి కోసమని చెబుతున్న ప్రభుత్వం.. కొందరు మంత్రులు కలిసి తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసి పేదలకు ఉచితంగా సినిమా చూపించాలంటూ వ్యంగాస్రాలు విసిరాడు. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆర్జీవీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాటల్లో..

‘కూరగాయల మార్కెట్లోకి వెళ్లి కొన్ని టామాటాలు కొంటాం. వాటిని ఇంటికి తెచ్చి చూస్తే కొన్ని పుచ్చిపోతాయి. అయితే వాటిని తీసుకెళ్లి మళ్లీ కొట్టుకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే అలా ఇవ్వకుండా పుచ్చిపోయిన టమాటను కొరికి నాకు ఈ టమాటా నచ్చలేదు అనే స్వేచ్చ కూడా ఉంటుంది. కొంచెం ఫోర్స్ చేస్తే ఆ కొట్టువాడు టమాటాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే వైసీపీకి ఓట్లేసిన ప్రజలు ప్రభుత్వం నచ్చలేదని అంటే మీరు దిగిపోతారా..?’

‘సాధారణంగా ప్రజలు, సంస్థలకు మధ్య ప్రత్యక్ష సంబంధాలుంటాయి. సంస్థలు తమ వస్తుసేవలను ప్రజలకు నేరుగా అందిస్తుంటాయి. అయితే ప్రభుత్వం ఈ విషయంతో ‘నాకేంటి..?’ అనే భావనతో ఉంటుంది. వాస్తవానికి ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలి. కానీ కొన్ని సంస్థలు నడవడంలో ప్రభుత్వ జోక్యం తీసుకోవడంతో వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతున్నాయి.’

‘సినిమా బాగుండాలాని భారీ బడ్జెట్ పెడుతారు. రాజమౌళి రూ.400 కోట్లతో సినిమా తీస్తాడు.. రామ్ గోపాల్ వర్మ రూ.5 లక్షలతో తీస్తాడు. అయితే ఈ రెండు సినిమాలను రూ.15 రూపాయలకే చూడాలని ప్రభుత్వం చెబుతోంది. అదెలా సాధ్యం అవుతుంది...? ఏ సినిమా విలువ ఆ సినిమాకు ఉంటుంది. ప్రభుత్వం పేదవారి గురించి సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించామని చెబుతోంది. నిజంగా ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరకు సినిమాలు చూపించాలని అనుకుంటే సినిమాటోగ్రఫీ మంత్రి నాని, మంత్రులు కొడాలి నాని, అనిల్ యాదవ్ లు కలిసి భారీ బడ్జెట్ తో ఓ సినిమా తీయండా ఆ తరువాత పేదలకు ఫ్రీగా చూపించండి..’

‘ప్రపపంచంలో ప్రతి ఒక్కిరికి ఒక బ్రాండ్ ఉంటుంది. ఇప్పుడున్న ఏపీ సీఎం జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు కాకపోతే ఆయనకు అన్ని ఓట్లు వచ్చునా..? వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే నేను ఎక్కువగా జగన్ నే ఫాలో అవుతా. కానీ వైఎస్ లేకుండా జగన్ కు బ్రాండ్ వచ్చిందా..? పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వీరికి కూడా వాళ్ల తండ్రుల వల్లే బ్రాండ్ వచ్చింది. కానీ జగన్ కు ప్రజలు ఓట్లేసింది మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ తోనే..ఈ విషయం అయన కూడా ఒప్పుకున్నాడు. అయితే ప్రజలకోసం ఎన్నుకోబడ్డ జగన్ అందరికీ న్యాయంచేసే విధంగా ఉండాలి. తన తండ్రి మాట నిలబెట్టుకునే విధంగా పనులు చేయాలి’

‘ఒక సినిమా ట్రైలర్లో ఎన్నో చెబుతాం.. అలాగే ఎలక్షన్ ముందు ప్రచారంలో మీరు కూడా ఎన్నో చెప్పారు. అయితే సినిమా సక్సెస్ అవడానికి కేవలం మూడు రోజులే ఉంటుంది. ప్రభుత్వానికి 5 ఏళ్ల సమయం ఉంటుంది. అలాంటప్పుడు సినిమాకు వారం రోజుల కలెక్షన్లే పెట్టుబడులు వస్తాయి.. ఆ తరువాత రావు.. కానీ ప్రభుత్వానికి ఐదేళ్లపాటు ఏదైనా చెయొచ్చు.’ అంటూ రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు.