Begin typing your search above and press return to search.

టీడీపీ స్నేహితుడిని కాంగ్రెస్ లోకి లాగేందుకు రేవంత్ యత్నాలు?

By:  Tupaki Desk   |   10 Aug 2021 7:39 AM GMT
టీడీపీ స్నేహితుడిని కాంగ్రెస్ లోకి లాగేందుకు రేవంత్ యత్నాలు?
X
రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నాడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టగానే తనను వ్యతిరేకించిన వారందరి ఇల్లకు వెళ్లి మరీ వాళ్లను అనునయించి మద్దతు కూడగట్టారు.తెలంగాణలోని ప్రధాన ప్రముఖులు, మీడియా అధినేతల వద్దకు వెళ్లి వారి సపోర్టును కాంక్షించారు. ఇప్పుడు కాంగ్రెస్ బలోపేతం కోసం కీలక అడుగులు వేస్తున్నారు.

రేవంత్ రెడ్డి వేసే అడుగులు ఆసక్తిగా మారుతున్నాయి.. సాధారణంగా సమావేశమైనా.. సంతాపం తెలుపడానికి వెళ్లినా హాట్ టాపిక్ గా మారుతోది. రాజకీయాల్లో ప్రతి దానికి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. వ్యతిరేక శిబిరాలలో ఉన్నప్పుడు ఇద్దరు నాయకులు కలిసినప్పుడు రాజకీయాలు హాట్ హాట్ గా మారుతాయి.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డిని కలిశారు. దీంతో రాజకీయవర్గాల్లో జోరుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామంతో తీగల కాంగ్రెస్ లో చేరుతున్నారా? అన్న చర్చ మొదలైంది.

ఇక రేవంత్ రెడ్డికి తీగలతో అనుబంధం ఉంది. వీరిద్దరూ పాత స్నేహితులు. టీఆర్ఎస్ లో ఉన్న తీగల ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరమని తన పాత స్నేహితుడిని అహ్వానించినట్టు తెలిసింది. నాయకులు ఎవరూ దీన్ని ధృవీకరించనప్పటికీ ప్రచారం మాత్రం ఇదే జరుగుతోంది.

తీగల తన కెరీర్ ను టీడీపీలో ప్రారంభించాడు. 2014లో ఆయన టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచాడు. అనంతరం టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో తీగల ఓడిపోయారు. సబిత టీఆర్ఎస్ లో చేరడంతో ఇప్పుడక్కడ కాంగ్రెస్ కు నాయకుల కొరత ఉంది. అందుకే తీగలను కాంగ్రెస్ లోకి రప్పించాలని రేవంత్ ప్రయత్నించినట్టు తెలుస్తోంది.