Begin typing your search above and press return to search.
డీజీపీ శరీరంలోకి రివాల్వర్ రెండు బుల్లెట్లు..ఇంట్లో ఎవ్వరూ లేనిసమయంలో..!
By: Tupaki Desk | 3 Sept 2020 12:15 PM ISTకర్ణాటక పోలీసు హౌసింగ్ బోర్డు డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.పి.శర్మా శరీరంలోకి రివాల్వర్ బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఇంట్లో ఉన్న ఆర్.పి. శర్మా శరీరంలోకి బుల్లెట్ లు దూసుకోవడంతో ఒక్కసారిగా ఈ ఘటన కలకలం సృష్టించింది. ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి శరీరంలోకి బుల్లెట్ లు దూసుకోవడంతో ప్రజలు ఏమైందో తెలియక కంగారు పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే బెంగళూరు నగర పోలీసు కమిషనర్, సీనియర్ ఐపీఎస్ ఆరోగ్య పరిస్థితి పై వివరాలు తెలుసుకొని , సంబంధిత ఘటన గురించి వివరాలు సేకరించారు.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. కర్ణాటక హౌసింగ్ బోర్డు కార్పోరేషన్ డీజీపీగా పని చేస్తున్న కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.పి. శర్మా బుధవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్నారు . ఆ సమయంలో రివాల్వర్ లోని రెండు బుల్లెట్ లు డీజీపీ ఆర్.పి. శర్మా శరీరంలోకి దూసుకోయాయి. తర్వాత ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు, ఆ సంఘటనను చూసి వెంటనే ఆయన్ను హెబ్బాళ సమీపంలోని కోలంబియా ఏషియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్, బెంగళూరు ఈశాన్య విభాగం డీసీపీ భీమాశంకర్ తదితర సీనియర్ పోలీసు అధికారులు కోలంబియా ఏషియా ఆసుపత్రి చేరుకుని డీజీపీ ఆర్.పి. శర్మా ఆరోగ్యం గురించి డాక్టర్స్ తో మాట్లాడారు. డీజీపీ ఆర్.పి. శర్మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న డీజీపీ ఆర్,పి. శర్మా ఆయన సర్వీస్ రివాల్వర్ శుభ్రం చేస్తున్న సమయంలో ఆకస్మికంగా బుల్లెట్లు దూసుకుపోయాయని, ఆయన ఛాతి, గొంతు భాగంలో రెండు బుల్లెట్లు దూసుకుపోయాయని, ఇది ఆకస్మికంగా జరిగిన ప్రమాదమని బెంగళూరు ఈశాన్య విభాగం డీసీపీ భీమాశంకర్ తెలిపారు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారికి బుల్లెట్ గాయాలు కావడంతో మొదట అనేక అనుమానాలు మెదిలాయి. డీజీపీ ఆర్,పీ. శర్మా సర్వీస్ రివాల్వర్ నుంచి ఆకస్మికంగా బుల్లెట్ లు దూసుకుపోయాయని తెలియడం తో ఆ అనుమానాలకు తెరపడింది. 1997 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన డాక్టర్ ఆర్,పీ, శర్మా గతంలో బీఎంటీఎఫ్ ఏడీజీపీగా పని చేసిన సమయంలో మంచి పేరు తెచ్చుకున్నారు.