Begin typing your search above and press return to search.

పాకిస్ధాన్ పై రివర్స్ ఎటాక్

By:  Tupaki Desk   |   28 Dec 2020 5:00 PM IST
పాకిస్ధాన్ పై రివర్స్ ఎటాక్
X
పాకిస్ధాన్ పై రివర్స్ ఎటాక్ మొదలైందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకాలం మన సరిహద్దుల్లోకి చొరబాటుదారులను పంపించ మారణహోమాన్ని చేయిస్తోంది దాయాది దేశం పాకిస్ధాన్. జమ్మూ-కాశ్మార్ రాష్ట్రంలోని ప్రతిరోజు ఏదో పద్దతిలో టెర్రరిస్టులను పంపించటం మారణహోమం చేయించటానికి పాకిస్ధాన్ బాగా అలవాటు పడిపోయింది. ఇలాంటి పాకిస్ధాన్ సైన్యం మీదకు తాజాగా టెర్రరిటస్టులు రివర్స్ ఎటాక్ చేశారు.



బలూచిస్ధాన్ ప్రాంతంలోని ఫ్రాంటియర్ చెక్ పోస్టు ప్రాంతంలోని సైనికపోస్టుపై టెర్రరిస్టులు హఠాత్తుగా ఎటాక్ చేశారు. సైన్యం ఊహించని రీతిలో జరిగిన దాడిలో సుమారు ఏడుగురు సైనికులు మరణించినట్లు సమాచారం. అలాగే ఈ ప్రాంతంలోని మరో సైనిక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో నలుగురు సైనికులు చనిపోయారు. మరి హెలికాప్టర్ దానంతట అదే కూలిపోయిందా ? లేకపోతే ఎవరైనా కూల్చేశారా ? అన్నదే తెలీలేదు. పాకిస్ధాన్ మీడియా సమాచారం ప్రకారమైతే టెర్రరిస్టులే హెలికాప్టర్ ను కూల్చేశారట.



రెండు ఎటాకుల్లో పాల్గొన్న ఉగ్రవాదుల కోసం పాక్ సైన్యం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు మొదలుపెట్టింది. ఐదు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో సైన్యం జరిపిన దాడిలో 10 మంది ఉగ్రవాదులు మరణించారు. దానికి ప్రతీకారంగానా అన్నట్లు ఆదివారం టెర్రరిస్టులు సైనికపోస్టుపై దాడిచేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. నిజానికి పాక్ సైనిక శిబిరంపై కాల్పులను సైన్యాధికారులు ఏమాత్రం ఊహించలేదట. ఎందుకంటే టెర్రరిస్టులకు పాకిస్ధాన్ సైన్యమే శిక్షణ ఇస్తోందని ఇఫ్పటికే అనేక అంతర్జాతీయ వేదికలపై మనదేశం ఆరోపించిన విషయం తెలిసిందే.



ఉగ్రవాడులకు అవసరమైన ఆయుధ శిక్షణ ఇచ్చి మనదేం మీదకు వదులుతోంది పాక్ సైన్యం. శతృవుల మీద దాడులు చేయటానికి పాకిస్ధాన్ సైన్యం ఇచ్చిన శిక్షణ తీసుకుని చివరకు రివర్సులో తమ మీదనే ఎటాక్ చేస్తారని ఎవరు ఊహించలేదు. మొత్తానికి పాకిస్ధాన్ కు బెలూచిస్ధాన్ ప్రాంతంలో రివర్సు ఎటాక్ లు మొదలైనట్లు సమాచారం. ఎందుకంటే సంవత్సరాల తరబడి బెలూచిస్ధాన్ ప్రాంతంలో పాకిస్ధాన్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అంటే ఈ ప్రాంతంలో పాకిస్ధాన్ సైన్యానికి సమాంతరంగా తిరుగుబాటుదారులు రెడీ అయ్యారు.