Begin typing your search above and press return to search.

భయపడుతున్న రెవెన్యూ అధికారులు

By:  Tupaki Desk   |   15 Nov 2019 8:04 AM GMT
భయపడుతున్న రెవెన్యూ అధికారులు
X
తహసీల్దార్ విజయారెడ్డి మరణం తర్వాత రెవెన్యూ శాఖ లోని సిబ్బంది లో టన్నుల కొద్దీ భయం కనిపిస్తోంది. ప్రభుత్వం లో కీలకమైన భూ, పరిపాలన, వసూళ్లు , సర్టిఫికెట్లు అన్నీ రెవెన్యూశాఖలో ఉండడంతో ఎవరు ఎప్పుడు ఏం చేస్తారోనన్న భయం అధికారులను వెంటాడుతోంది. అందుకే ఇప్పటికే మహిళా రెవెన్యూ అధికారులంతా 'పెప్పర్ స్ప్రేలు' కొనుక్కొని బ్యాగుల్లో పెట్టుకుంటున్నారట.. ఇక తాజాగా పురుష రెవెన్యూ అధికారులు సైతం రక్షణ చర్యలు చేపడుతుండడం విశేషం.

తాజాగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం లో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. డైరెక్టుగా దరఖాస్తులను తీసుకోకుండా కిటికీ కి ఊచలు బెట్టి అందులోంచే తీసుకుంటున్నారు.

వివిధ పనుల పై కార్యాలయానికి వచ్చే దరఖాస్తు దారులను తహసీల్దార్ ఉండే గదిలోకి రానీయడం లేదు. కిటీకీల ద్వారా మాత్రమే దరఖాస్తులను తీసుకుంటున్నారు. తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది భయ భ్రంతులకు గురి అవుతున్నారు.

దాదాపు వారం పాటు విధులను బహిష్కరించిన రెవెన్యూ సిబ్బంది తాజాగా విధుల్లోకి చేరాక అప్రమత్తం గా వ్యవహరిస్తున్నారు. ప్రజలను లోపలికి రానీయకుండా గేటు వద్దే వారిని వీఆర్ఏలు తనిఖీలు చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారు. కిటీకీ లోంచి మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.