Begin typing your search above and press return to search.
మోడీ భండారాన్ని 10 సెకన్ల వీడియోలో బయటపెట్టాడట
By: Tupaki Desk | 17 May 2021 8:00 PM ISTవాజ్ పేయ్.. ఎల్ కే అద్వానీ లాంటి బీజేపీ నేతలు ఒక వెలుగు వెలిగిన కాలంలో.. కొందరు పేర్లు తరచూ వార్తల్లో కనిపిస్తూ ఉండటమే కాదు.. ప్రభుత్వంలో వారు కీలక భూమిక పోషించేవారు. ఆ కోవలోకే వస్తారు మాజీ బీజేపీ నేత.. ప్రస్తుతం దీదీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా. మేధావిగా ఆయనకు మంచి పేరు ఉంది. మోడీ అంటే ఏ మాత్రం ఇష్టపడని ఆయన.. తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేయటంలో ఫెయిల్ అయ్యారన్న ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
పది సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన.. మోడీ తీరును తూర్పార పట్టారు. ఈ పది సెకన్ల వీడియో మోడీ భండారాన్ని బయటపెట్టింది. భారత్ తన ప్రజలకు ఇచ్చిన దాని కంటే ఎక్కువ టీకాల్ని విదేశాలకు పంపినట్లుగా ఐక్యరాజ్య సమిలో భారత రాయబారి చెప్పారన్నారు. దీనికి సంబంధించిన క్లిప్ ను ఆయన షేర్ చేశారు.

''మోడీ ఇప్పుడు నిజంగానే ప్రపంచ నేత. భారతీయులు ఎలా పోతేనేం'' అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన కామెంట్ కు జతగా.. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత రాయబారి ప్రసంగించిన వీడియో క్లిప్ ను జత చేశారు. ఆ వీడియోలో భారత్ లో సరఫరా చేసిన టీకాల కంటే అధికంగా 70 దేశాలకు భారత్ టీకాల్ని సరఫరా చేసినట్లుగా అందులో పేర్కొన్నారు. టీకాల కొరత కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆపేస్తున్నారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే 18-44 ఏళ్ల మధ్య వారికి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే.. టీకా కొరత కారణంగా రెండో డోస్ టీకాకే దిక్కు లేని పరిస్థితి నెలకొంది. వ్యాక్సినేషన్ విషయంలో మోడీ సర్కారు వైఫల్యాన్ని కళ్లకు కట్టేలా తాజా వీడియో ఉందని చెప్పాలి.