Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ ను గెలిపించండి.. రేవంత్ సంచలనం
By: Tupaki Desk | 22 Jan 2020 10:03 AM ISTటీడీపీ లో వెలుగు వెలిగి.. ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎదిగిన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు 2019 ఎన్నికల వేళ అనూహ్యం గా టీఆర్ఎస్ పార్టీలో చేరి టికెట్ పొంది పోటీ చేశారు. అయితే టీడీపీ లో దశాబ్ధాలుగా ఆయన ప్రస్థానం సాగడంతో ఎంపి ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు చాలా సార్లు టీడీపీని గెలిపించాలని.. సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని నోరు జారారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అన్నేళ్లు గా టీడీపీ తో అనుబంధం తో ఆయన టీఆర్ఎస్ లో చేరినా కూడా ఆయన నోటి నుంచి సైకిల్ పార్టీ గుర్తే వచ్చింది.. పార్టీలు మారిన నేతలకు మొదట ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి..
ఆ కోవలోనే తాజాగా టీపీసీసీ వర్కింగ్ రేవంత్ రెడ్డి కూడా నోరుజారడం విశేషం. మున్సిపల్ ఎన్నికల వేల రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక వీడియో వైరల్ అవుతోంది.
తన సమర్థ నాయకత్వాన్ని చూసి మున్సిపల్ ఎన్నికల్లో అన్ని డివిజన్లు, వార్డుల్లో టీఆర్ఎస్ కు ఓటువేసి గెలిపించాలంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీఆర్ ఎస్ అంటే పట్టని.. గిట్టని.. కేసీఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే రేవంత్ రెడ్డి ఏకంగా టీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరడం హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ ఎస్ ను విమర్శిస్తూ దాన్ని నామస్మరణ చేస్తూ ఇలా పొరపాటున రేవంత్ రెడ్డి అన్నాడా? ఎవరైనా ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి వదిలారా అన్నది తెలియాల్సి ఉంది. రేవంత్ రెడ్డి మాత్రం దీనిపై అధికారికంగా స్పందించలేదు. ఎన్నికల వేళ మాత్రం ఈ వీడియో కాంగ్రెస్ కు, రేవంత్ కు మైనస్ గా మారింది.