Begin typing your search above and press return to search.

కేటీఆర్ భార్య ఎస్టీ.. క‌విత‌కు పిల్ల‌ల్లేరు..

By:  Tupaki Desk   |   1 Oct 2018 4:02 PM IST
కేటీఆర్ భార్య ఎస్టీ.. క‌విత‌కు పిల్ల‌ల్లేరు..
X
ముంద‌స్తు ఎన్నిక‌లు త‌రుముకొస్తుండ‌టంతో తెలంగాణ‌లో కాంగ్రెస్ నేత‌లు త‌మ మాట‌ల్లో ప‌దును పెంచుతున్నారు. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబమే ల‌క్ష్యంగా విమ‌ర్శ‌ల జ‌డి పెంచుతున్నారు. వారిపై ప‌లు అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. టీఆర్ ఎస్‌ ను దీటుగా ఎదుర్కునే సామ‌ర్థ్యం లేక‌పోవ‌డం వల్లే ప్ర‌త్య‌ర్థి పార్టీలు త‌మ కుటుంబాన్ని ల‌క్ష్యంగా చేసుకుంటున్నాయ‌ని కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ప్ర‌తి విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా.. ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌ధానంగా కాంగ్రెస్ వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

తాజాగా తెలంగాణ‌ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కొడంగ‌ల్‌లో ఆదివారం జ‌రిగిన బ‌హిరంగ స‌మావేశంలో వారిపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ మామ పాకల హ‌రినాథ్ రావు చాలా ఏళ్ల క్రితం న‌కిలీ ఎస్టీ స‌ర్టిఫికెట్ సృష్టించార‌ని.. దాని ద్వారానే ఆయ‌న ప్ర‌భుత్వ ఉద్యోగం పొందార‌ని ఆరోపించారు. కొన్నేళ్ల క్రితం హ‌రినాథ్ రావు అట‌వీశాఖ అధికారిగా రిటైర్ అయ్యార‌ని.. అయినా, ఇప్ప‌టికీ ఎస్టీ వ్య‌క్తిగా పింఛ‌న్ తీసుకుంటున్నార‌ని తెలిపారు. ఎస్టీల‌కు విద్య‌ - ఉద్యోగాల్లో 12 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తానంటూ కేసీఆర్ ఆర్భాటంగా చెబుతుంటార‌ని అన్నారు. మ‌రి త‌ప్పుడు కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రంతో ప్ర‌భుత్వాన్ని మోస‌గించిన వియ్యంకుడు హ‌రినాథ్‌పై ఆయ‌న చ‌ర్య‌లు తీసుకోగ‌ల‌డా? అని స‌వాలు చేశారు. ఎస్టీ వ్య‌క్తిగా పింఛ‌ను తీసుకుంటున్న వ్య‌క్తి కుమార్తె ఎస్టీ కాదా? అని ప్ర‌శ్నించారు. త‌న కోడ‌లు శైలిమ ఆదివాసీ (లేదా) లంబాడీ వ్య‌క్తి కాద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేయ‌గ‌ల‌రా? అని ఛాలెంజ్ విసిరారు.

అధికారిక కార్య‌క్ర‌మాల‌కు కేటీఆర్ కుమారుడు హిమాన్షు హాజ‌ర‌వుతుండ‌టంపైనా రేవంత్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఏ హోదాలో హిమాన్షు భ‌ద్రాచ‌లం ఆల‌యానికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున దుస్తులు తీసుకెళ్లారో చెప్పాల‌న్నారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోకి, స‌చివాల‌యంలోకి హిమాన్షు త‌న స్నేహితుల‌తో క‌లిసి వ‌చ్చేలా చొర‌వ ఇవ్వ‌డాన్ని ప్ర‌శ్నించారు. పార్టీలో, ప్ర‌భుత్వంలో ఆ బాలుడి హోదా ఏంటో చెప్పాలంటూ నిల‌దీశారు.

మ‌రోవైపు, 2014 లోక్‌ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌ను కాంగ్రెస్ నేత‌లు ప్రస్తుతం విస్తృత ప్ర‌చారంలోకి తెస్తున్నారు. త‌న‌కు పిల్ల‌లు లేర‌ని.. కాబ‌ట్టి వారి పేర్ల‌పై ఆస్తులు కూడా లేవ‌ని అఫిడ‌విట్లో క‌విత పేర్కొన్న‌ట్లు వారు చెబుతున్నారు. వాస్త‌వానికి ఆమెకు ఇద్ద‌రు కొడుకులున్న సంగ‌తి అంద‌రికీ తెలుసున‌న్నారు. ఈసీకి క‌విత త‌ప్పుడు అఫిడ‌విట్ స‌మ‌ర్పించారంటూ వారు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.