Begin typing your search above and press return to search.

రేంజ్ పెంచుకోవ‌డానికి రేవంత్ ప‌బ్లిసిటీ ట్రిక్స్ !

By:  Tupaki Desk   |   16 Nov 2018 4:18 PM IST
రేంజ్ పెంచుకోవ‌డానికి రేవంత్ ప‌బ్లిసిటీ ట్రిక్స్ !
X
తెలుగుదేశంలో ఉన్నా - కాంగ్రెస్‌ లో ఉన్నా రేవంత్ రెడ్డి త‌న‌కు తాను ముఖ్య‌మంత్రి అభ్యర్థిని అని ఫీల‌వుతుంటారు. అయితే, ఇప్ప‌టికే ఇలాంటి వారి బాప‌తు కాంగ్రెస్ లో చాలా ఎక్కువ మంది కాబ‌ట్టి ఇంకో సీఎం వ‌చ్చారు కాంగ్రెస్ లోకి అని సెటైర్లు వేస్తున్నారు సోష‌ల్ మీడియా జ‌నం. ఇది ప‌క్క‌న పెడితే కేసీఆర్ ను ప‌దే ప‌దే టార్గెట్ చేయ‌డం ద్వారా రేవంత్‌ రెడ్డి త‌న‌ది కేసీఆర్ రేంజ్ చెప్పుకోవ‌డానికి త‌హ‌త‌హ‌లాడుతుంటారు. దీనికోసం రోజూ ఏదో ఒక‌టి కేసీఆర్ తో లింకు పెట్టి ఆరోప‌ణ చేస్తుంటారు. అవి ఎలా ఉంటాయంటే... కేసీఆర్ రోజంతా కూర్చుని రేవంత్ గురించే ఆలోచిస్తున్న‌ట్లు ఉంటాయి.

తాజాగా రేవంత్ ఏమ‌న్నారో తెలుసా... త‌న నామినేష‌న్ ఎలాగైనా తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యేలా చేయాల‌ని కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు రేవంత్ ఆరోపించారు. అయితే, రేవంత్ గెలిచినా - ఓడినా...కేసీఆర్ కు ఫ‌రక్ లేదు. ఇప్ప‌టికే వంద సీట్లు కాన్ఫిడెన్స్‌ తో ఉన్నాడు కేసీఆర్‌. అయితే ట్రెండు చూస్తుంటే క‌నీసం సొంత మెజారిటీతో గెలుస్తాడు అంటున్నారు. కేసీఆర్ ఏనాడూ రేవంత్ గురించి ప‌దేప‌దే మాట్లాడ‌డు. కానీ కేసీఆర్ గురించి రేవంత్ రోజూ మాట్లాడ‌తాడు. దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది. ఎవ‌రి రేంజ్ ఎంతో!

రేవంత్ నామినేష‌న్లు వేశాక ఇంకో రెండు కేసులు రేవంత్‌ పై ఉన్నాయ‌ని డీఎస్పీ స్థాయి అధికారి ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చార‌ట‌. అందుకే రేవంత్ ఈఆరోప‌ణ‌లు చేశారు. నిజానికి ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ పోటీ చేస్తున్న అంద‌రి వివ‌రాలు తీసుకుంటుంది. అలాగే రేవంత్‌ ది తీసుకుంది. అంత‌మాత్రాన ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం సిల్లీ. అయినా రేవంత్ పై గెలిస్తే కేసీఆర్ గ‌ర్వంగా ఫీల‌వుతారు గాని రేవంత్ పోటీలో లేకుంటే కేసీఆర్ కూడా మ‌జా ఫీలవ‌రు. అస‌లు చ‌రిత్ర చూసుకున్నా కూడా కేసీఆర్ తీరే వేరు. ప్ర‌త్య‌ర్థిని ప‌ట్టించుకోడు. త‌నేంటో చెప్పుకుంటూ పోతాడు. రేవంత్ మాత్రం కేసీఆర్ ను ఢీకొట్ట‌డానికి త‌హ‌త‌హలాడుతుంటారు. అంతా ప‌బ్లిసిటీ వ్యామోహ‌మేమో.